Tandur: తాండూరులో మహా పడి పూజ నిర్వహించిన పైలెట్ రోహిత్ రెడ్డి

Tandur: తాండూరు అయ్యప్ప నగర్ ధర్మశాస్త దేవాలయంలో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కుటుంబ సమేతంగా మహా పడి పూజ; భక్తులకు సేవలందించారు.

Srikanth Reddy, Tandur
Published on: 25 Nov 2026 7:04 PM IST
Tandur
X

Tandur: తాండూరులో మహా పడి పూజ నిర్వహించిన పైలెట్ రోహిత్ రెడ్డి

తాండూరు: తాండూరు నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆకాంక్షించారు. బుధవారం తాండూర్ అయ్యప్ప నగర్‌లోని శ్రీ శ్రీ శ్రీ ధర్మశాస్త అయ్యప్ప స్వామి దేవాలయంలో తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కుటుంబ సమేతంగా అత్యంత వైభవంగా శ్రీ అయ్యప్ప స్వామి మహా పడి పూజా కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో వైభవంగా నిర్వహించారు.

పూజ కార్యక్రమం అనంతరం అయ్యప్ప స్వాములకు స్వయంగా సేవలందించారు. అయ్యప్ప స్వామి మాలధారణ చేసిన స్వాములు, భక్తుల సమక్షంలో పూజా కార్యక్రమాలు కన్నులపండువగా సాగాయి. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించి పుష్పాలతో సుందరంగా అలంకరించారు. స్వామివారి సన్నిధిలో ఏర్పాటు చేసిన దీపాలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. పడిపూజలో భాగంగా అయ్యప్ప భజనలు, భక్తి గీతాలు, శరణుఘోషలతో పరిసర ప్రాంతమంతా భక్తిమయంగా మారింది. స్వామియే శరణం అయ్యప్ప అనే నామస్మరణతో భక్తులు ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోయారు.

అయ్యప్ప దీక్ష చేపట్టిన స్వాములు సంప్రదాయ నియమనిష్ఠలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు పొందేందుకు మండలంలోని వివిధ గ్రామాల నుంచి అయ్యప్ప స్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు. అత్యంత వైభవంగా నిర్వహించిన మహా పడి పూజా కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.

Srikanth Reddy, Tandur

Srikanth Reddy, Tandur