Tandur: తాండూరులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటా వార్పు నిరసన!
Tandur: తాండూరులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు వంటావార్పు నిరసన చేపట్టి, కాంగ్రెస్ వైఫల్యాలపై మండిపడ్డారు.
Tandur: తాండూరులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటా వార్పు నిరసన!
Tandur: బిఆర్ఎస్ అధినేత కేసిఆర్,పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల పిలుపు మేరకు తాండూరు మాజీ శాసనసభ్యులు పైలట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలో భద్రేశ్వర కూడలిలో వంటా వార్పు కార్యక్రమంతో నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తామని 1000 రోజులైనా హామీలు అమలు చేయలేదని అన్నారు.తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన ఇచ్చిన ఆరు గ్యారెంటీలను, 420 హామీలను ఇంక్కెపుడు అమలు చేస్తారు అని అన్నారు .
ప్రతి మహిళను మహాలక్ష్మిని చేస్తామని, ప్రతినెలా రూ.2,500 ఇస్తామని చెప్పి ఇంతవరకు అమలుచేయలేదన్నారు.పెన్షన్లను పెంచుతామని ప్రతి ఒక్కరికి అందిస్తామని చెప్పడమే తప్ప ఇంతవరకు వాటిని అమలు చేయలేదని విమర్శించారు. రూ.500 కే సిలిండర్ అంటూ ప్రజలను ఊదరగొట్టి ఇప్పుడు ప్రజలకు నరకం చూపిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




