Tandur: అదృశ్యమైన గురుకుల పాఠశాల విద్యార్థి ఆచూకీ లభ్యం
Tandur: తాండూరు గురుకుల పాఠశాలలో అదృశ్యమైన విద్యార్థి అక్షిత్ మోమిన్ పేట్ సమీపంలో క్షేమంగా దొరకడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
Tandur: అదృశ్యమైన గురుకుల పాఠశాల విద్యార్థి ఆచూకీ లభ్యం
తాండూరు: తాండూరు పట్టణం విజయనగర్ కాలనీలో ఉన్న పెద్దేముల్ మండల టీఎస్ డబ్ల్యూ ఆర్ ఎస్ రెసిడెన్షియల్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న మోమిన్ పేట్ మండలం కాస్లాబాద్ గ్రామానికి చెందిన అక్షిత్ అనే విద్యార్థి గురువారం ఉదయం 8 గంటల నుండి కనిపించకపోవడంతో విద్యార్థి ఆచూకీ కోసం ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా రాత్రి వరకు ఆచూకీ లభ్యం కాకపోవడంతో పాఠశాల పిడి( ఫిజికల్ డైరెక్టర్) ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మోమిన్ పేట్ పెట్రోల్ బంక్ సమీపంలో నడుచుకుంటూ వస్తున్న అక్షిత్ ను శుక్రవారం రాత్రి స్థానికులు గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం అందించి తల్లిదండ్రులకు అప్పగించారు.
అదృశ్యమైన విద్యార్థి ఆచూకీ లభ్యం కావడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఇకనైనా హాస్టల్లో లో ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు విద్యార్థులపై చేస్తున్న వేధింపులు, ఆకృత్యాలు ఆపాలని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు కోరుకుంటున్నారు.




