vikarabad: ప్రమాదానికి గురైన విద్యార్థికి అండగా తాండూరు ఎమ్మెల్యే:

vikarabad: CMRF చెక్కును తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అందజేశారు. గతంలో వ్యక్తిగతంగా రూ. 20 వేల ఆర్థిక సాయం కూడా అందించారు.

Srikanth Reddy, Tandur
Published on: 20 July 2026 5:39 PM IST
vikarabad
X

vikarabad: ప్రమాదానికి గురైన విద్యార్థికి అండగా తాండూరు ఎమ్మెల్యే: రూ.1,43,200 సాయం

తాండూరు: క్రీడా పోటీల్లో ప్రమాదవశాత్తు గాయపడిన విద్యార్థి సుశాంత్‌కు ప్రభుత్వం నుంచి మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కును తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అందజేశారు. సోమవారం తాండూరులోని తన క్యాంప్ కార్యాలయంలో విద్యార్థి కుటుంబ సభ్యులకు రూ. 1,43,200 విలువగల చెక్కును ఆయన చేతుల మీదుగా అందజేశారు.

పాఠశాలలో ఊహించని ప్రమాదం:

గతంలో బషీరాబాద్ జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఆవరణలో జోనల్ స్థాయి క్రీడా పోటీలు జరుగుతుండగా, విద్యార్థి సుశాంత్ తలపై అకస్మాత్తుగా చెట్టు కొమ్మ విరిగిపడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సుశాంత్ హైదరాబాద్‌లోని ఆలివ్ ఆసుపత్రిలో సుదీర్ఘ చికిత్స పొంది ఇటీవలే కోలుకున్నాడు.

ముందే ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే:

కాగా, సుశాంత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్పందించి, తన వ్యక్తిగత ఖాతా నుంచి రూ. 20,000 సాయాన్ని తక్షణ ఉపశమనంగా కుటుంబ సభ్యులకు అందజేశారు. తాజాగా మెరుగైన చికిత్స ఖర్చుల కోసం ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో సీఎంఆర్‌ఎఫ్ నిధులు మంజూరు చేయించారు.

కష్టకాలంలో అన్ని విధాలుగా అండగా నిలిచి, వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహకారం అందించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి విద్యార్థి సుశాంత్ కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Srikanth Reddy, Tandur

Srikanth Reddy, Tandur

Next Story