Tandur: తాండూరులో ఓటరు చైతన్య 2కే రన్.. జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే

Tandur: వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఓటరు చైతన్య అవగాహన (SIR) కార్యక్రమంలో భాగంగా భారీ 2కే రన్ నిర్వహించారు.

Srikanth Reddy, Tandur
Published on: 17 Jun 2026 11:05 AM IST
Tandur
X

Tandur: తాండూరులో ఓటరు చైతన్య 2కే రన్.. జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే

Tandur: ఓటు హక్కు పరిరక్షణే ప్రజాస్వామ్యానికి బలమైన పునాది అని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.ఎస్‌ఐఆర్ (SIR) అవగాహన కార్యక్రమంలో భాగంగా తాండూర్ ఆర్డీఓ అనిత ఆధ్వర్యంలో ఇందిరా చౌక్ నుండి సెయింట్ మార్క్స్ స్కూల్ వరకు నిర్వహించిన 2కే రన్‌లో ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ..

ఎస్‌ఐఆర్ అవగాహన కోసం వేస్తున్న ప్రతి అడుగు ప్రజా చైతన్యానికి నాంది అని పేర్కొన్నారు . ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి పౌరుడికి అత్యంత విలువైన రాజ్యాంగబద్ధమైన హక్క, ఈ హక్కును పరిరక్షించడం, ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో నమోదు కావడం మనందరి బాధ్యత అన్నారు.

ఈ 2కే రన్ కేవలం ఒక పరుగు కార్యక్రమం కాదు; ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే ప్రజా చైతన్య యాత్ర తెలియజేశారు. నకిలీ ఓట్లకు తావులేకుండా, ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించేలా ప్రతి BLO, ప్రతి BLA అత్యంత బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.ప్రజాప్రతినిధులు, అధికారులు, యువత కలిసి ఓటు హక్కు ప్రాముఖ్యతను ప్రతి ఇంటికి చేర్చాలని అన్నారు.

'మన ఓటు – మన భవిష్యత్తు', 'ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండాలి' అనే సంకల్పంతో ముందుకు సాగుదామని తెలిపారు.ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నేను కోరుతున్నాను అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్‌రెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్,తాండూర్ ఆర్డీఓ అనిత గారు, మున్సిపల్ కమిషనర్ రాకేష్ రెడ్డి, ఎమ్మార్వోలు, అధికారులు, వార్డు కౌన్సిలర్లు, మరియు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.

Srikanth Reddy, Tandur

Srikanth Reddy, Tandur

Next Story