Tandur: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దృష్టి!

Tandur: మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయులతో క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు.

Srikanth Reddy, Tandur
Published on: 27 Oct 2026 11:35 PM IST
Tandur
X

Tandur: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దృష్టి!

తాండూర్: త్వరలో జరగనున్న ఉమ్మడి మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పరిధిలోని పట్టభద్రులకు ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామాలు మరియు పట్టణాల్లో పట్టభద్రులను గుర్తించడం, నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించాలని అన్నారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడికి ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములను చేయాలని తెలిపారు.

Srikanth Reddy, Tandur

Srikanth Reddy, Tandur