Tandur: వర్షాలు కురిసి పంటలు పండాలి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి!
Tandur: తాండూరులో గ్రీన్ అండ్ సీడ్స్ మర్చంట్ అసోసియేషన్ వరుణ హోమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని ప్రార్థన.
Tandur: వర్షాలు కురిసి పంటలు పండాలి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి!
Tandur: వర్షాలు సమృద్ధిగా కురవాలి పంటలు నిండుగా పండాలి -తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు నిండుగా పండాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆకాంక్షించారు. సోమవారం తాండూరు పట్టణంలో గ్రీన్ అండ్ సీడ్స్ మర్చంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రుద్రాభిషేకం జలాభిషేకం వరుణ హోమంలో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...
తాండూరు నియోజకవర్గం వరుణ దేవుని కృపతో సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా ఆ భగవంతున్ని ప్రార్థించామన్నారు. నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఆ భగవంతునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. నియోజకవర్గ ప్రజలు నిరంతరం వారి ఇష్ట దేవాలయం ప్రార్థించుకుంటూ మానసిక ప్రశాంతత పొంది ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు.




