Tandur: మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే.. రోడ్డుపై ఆగి దివ్యాంగురాలికి భరోసా
Tandur: తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పర్యటనలో మానవత్వం చాటుకున్నారు. రోడ్డు పక్కన దివ్యాంగ మహిళను గమనించి తన కారు ఆపి, ఆమె సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
Tandur: మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే.. రోడ్డుపై ఆగి దివ్యాంగురాలికి భరోసా
Tandur: తాండూరు నియోజకవర్గ పర్యటనలో భాగంగా అంతారం తండా నుండి వస్తున్న సమయంలో మల్ రెడ్డి పల్లి రహదారి పక్కన కూర్చొని సహాయం కోరుతున్న దివ్యాంగ మహిళను గమనించిన ఎమ్మెల్యే వెంటనే తన వాహనాన్ని ఆపి ఆమె వద్దకు వెళ్లి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
ఆ మహిళ తనకు దివ్యాంగ పింఛన్ మంజూరు చేయాలని, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కల్పించాలని ఎమ్మెల్యే ని కోరింది. ఆమె సమస్యలను ఓపికగా విన్న ఎమ్మెల్యే గారు సంబంధిత అధికారులతో మాట్లాడి అర్హత ప్రకారం దివ్యాంగ పింఛన్ మరియు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Next Story




