Tandur: తాండూరులో ఎస్ఐఆర్ ఫేజ్ 2 సమీక్ష: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి!

Tandur: తాండూరులో ఎస్ఐఆర్ ఫేజ్ 2 ఓటర్ల సవరణపై సమీక్ష నిర్వహించామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించే వరకు విశ్రమించమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

Srikanth Reddy, Tandur
Published on: 26 Aug 2026 8:38 AM IST
Tandur
X

Tandur: తాండూరులో ఎస్ఐఆర్ ఫేజ్ 2 సమీక్ష: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి!

Tandur: తాండూరు నియోజకవర్గంలో ఎస్ ఐ ఆర్ ఫేస్ 1 లో ఓటర్ల సవరణ ప్రక్రియలో నెలకొన్న సమస్యలను అధిగమించి చివరి ఓటు చేర్పించే వరకు నిర్విరా మంగా ముందుకు సాగుతామని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలోని శ్రీ కన్వెన్షన్ లో ఎస్ ఐ ఆర్ ఫేస్ 2 సమీక్ష సమావేశంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు జగదీష్ తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ...

తాండూరు నియోజకవర్గంలో 59 వేల పైచిలుకు ఓట్ల విషయంలో నెలకొన్న ఇబ్బందులను అధిగమించి వారికి అందే నోటీసులకు సరైన ప్రతిస్పందన అందిస్తూ ప్రతి ఓటుకు న్యాయం చేసే విధంగా ముందుకు వెళ్తామన్నారు. బీ ఎల్ ఏ లు మరింత కష్టపడి ఫేస్ 2 ప్రక్రియ ను విజయవంతం చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ జిల్లా అధ్యక్షులు ధారాసింగ్,ఎస్ ఐ ఆర్ కన్వీనర్ కరణం పురుషోత్తమరావు,మున్సిపల్ చైర్ పర్సన్ నీరజా బాల్ రెడ్డి,వైస్ ఛైర్మెన్ అబ్దుల్ రజాక్, తాండూరు మార్కెట్ కమిటీ ఛైర్మెన్ వడ్డె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Srikanth Reddy, Tandur

Srikanth Reddy, Tandur

Next Story