Tandur: తాండూరు మున్సిపాలిటీలో నిధుల రచ్చ

Tandur: తాండూరు మున్సిపాలిటీలో రాజకీయాలు వేడెక్కాయి. బీఆర్‌ఎస్ కౌన్సిలర్లపై కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని 8వ వార్డు కౌన్సిలర్ జావిద్ మండిపడ్డారు.

Srikanth Reddy, Tandur
Published on: 2 July 2026 8:05 AM IST
Tandur
X

Tandur: తాండూరు మున్సిపాలిటీలో నిధుల రచ్చ

Tandur: వార్డు నుండి ట్యాక్స్ లు పూర్తిస్థాయిలో రావడంలేదని, వార్డు గురించి తనకు ఏమి చెప్పవద్దని నిధులు వార్డుకు ఇవ్వనని నిర్మొహమాటంగా మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి చెప్పడం ఏమాత్రం హర్షించదగ్గ విషయం కాదని ఎనిమిదో వార్డ్ కౌన్సిలర్ జావిద్ అన్నారు. బుధవారం తాండూరు మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో ఈనెల మూడున నిర్వహించే సర్వసభ్య సమావేశానికి ముందస్తు సమావేశం నిర్వహించారు.

సమావేశ అనంతరం ఈ సందర్భంగా ఎనిమిదో వార్డ్ కౌన్సిలర్ జావిద్ మాట్లాడుతూ.. వార్డు అభివృద్ధి గురించి ప్రశ్నించానని.. కాలనీ నుండి ఏ విధమైన టాక్స్ లు 100% వసూలు కావడం లేదని, వార్డు అభివృద్ధి గురించి తనను అడగవద్దని మున్సిపల్ చైర్ పర్సన్ అన్నారన్నారు. ఎమ్మెల్యే ఎలక్షన్లలో కాలనీవాసులు ఓట్లు వేయలేదా అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నామన్నారు.

ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో నీ వార్డుకు పైసా కూడా ఇచ్చేది లేదని మునిసిపల్ చైర్ పర్సన్ చెప్పడం ఎంతవరకు సమంజసం అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నామన్నారు. కాలనీలో చాలామంది తమ ఇండ్లను అమ్ముకొని వేరే ప్రదేశాలకు వెళ్లారన్నారు. మరి కొంతమంది కిరాయికి ఉంటున్నారన్నారు. అలాంటి వారందరికీ మీరు ఇంటి పట్టాలు ఇచ్చినట్లయితే మీకు 100% టాక్స్ లు పే చేసి చూపిస్తామన్నారు. మీ దగ్గర తప్పులు పెట్టుకొని మమ్ముల్ని నిలదీయడం సమంజసం కాదన్నారు.

మా వార్డు కూడా తాండూరు పరిధిలోని ఉందని తాండూరులో ప్రతి వార్డు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయో తన వార్డు కూడా అదే విధంగా అభివృద్ధి చెందాలని ఆ దిశగా మున్సిపల్ చైర్ పర్సన్ పక్షపాత దృష్టితో కాకుండా అన్ని వార్డును సమానంగా చూస్తూ తన వార్డుకు అభివృద్ధి నిధులను కేటాయించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నామన్నారు. తన కాలనీకి నిధులు అందించని పక్షంలో చైర్పర్సన్ ఛాంబర్ ను, ఇంటిని కాలనీ వాసులతో కలిసి ముట్టడిస్తామన్నారు.

Srikanth Reddy, Tandur

Srikanth Reddy, Tandur

Next Story