Vikarabad: ఉన్నత విద్యా ప్రమాణాలతో తాండూరుకు 'ది మాస్టర్ మైండ్స్' స్కూల్!
Vikarabad: వికారాబాద్ జిల్లా తాండూరులో 'ది మాస్టర్ మైండ్స్' స్కూల్ నూతన బ్రాంచ్ ప్రారంభం.
Vikarabad: ఉన్నత విద్యా ప్రమాణాలతో తాండూరుకు 'ది మాస్టర్ మైండ్స్' స్కూల్!
వికారాబాద్ జిల్లా: ది మాస్టర్ మైండ్స్ స్కూల్ ను తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి ప్రారంభించారు. ది మాస్టర్ మైండ్స్ స్కూల్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు మరియు చైర్మన్ రాజు సంగని నూతన బ్రాంచ్‌ను తాండూరు పట్టణంలో అందుబాటులోకి తీసుకురావడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి మాట్లాడుతూ.. అనాదికాలంలోనే ది మాస్టర్ మైండ్ 150 కి పైగా బ్రాంచ్ లను ఏర్పాటు చేయగా తాండూర్ లో మరో బ్రాంచ్ ఏర్పాటు కావడం సంతోషమని అన్నారు. పాఠశాల చైర్మన్ రాజు సంఘాని మాట్లాడుతూ.. ఉన్నత విలువలతో కూడిన విద్యను అందించడమే తమ ప్రధాన ఎజెండా అని అన్నారు. తాండూరు పట్టణ ప్రాంత ప్రజలు చాలా అదృష్టవంతులుగా భావించాలని కోరారు, తాండూర్ ప్రాంత ప్రజల సహకారంతో మునుముందు విద్యారంగంలో అనేకమైన సేవలు అందించడానికి తమ ఎప్పుడు ముందుంటామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తాండూర్ పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాల్ రెడ్డి, రాజు సంఘాని, మాజీ డిసిసిబి చైర్మన్ లక్ష్మారెడ్డి కౌన్సిలర్లు శ్రీకాంత్ ముదిరాజ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాతుల నాగు, మల్లేశం, ఏ బ్లాక్ అధ్యక్షులు, లోంక నర్సింలు, హరి హర గౌడ్, పర్యాధ రామ కృష్ణ, స్కూల్ ప్రెసిడెంట్ గులాం అహ్మద్ ఖాద్రి, వైస్ ప్రెసిడెంట్ అచ్చి నాగరాజు, జోనల్ మేనేజర్ కాజా హుస్సేన్, క్లస్టర్ అకాడమిక్ డైరెక్టర్ ప్రభాకర్ రావు, రాచూరి బసవరాజ్, మాణిక్యం, ప్రిన్సిపల్ తదితరులు, పాల్గొన్నారు.




