Tandur: దమ్ముంటే చర్చకు రండి.. బీఆర్ఎస్ కు సవాల్!
Tandur: తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు చేసిన అవినీతి ఆరోపణలను మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
Tandur: దమ్ముంటే చర్చకు రండి.. బీఆర్ఎస్ కు సవాల్!
Tandur: చర్చకు ఎక్కడైనా సిద్ధం, బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అవినీతిపై చర్చకు రావాలన్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తాండూరు పట్టణ అధ్యక్షులు నాగరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, వైస్ చైర్మన్ కాసిం, మాజీ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, కౌన్సిలర్ ఎల్లప్ప లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ....
వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనపై బి.ఆర్.ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ లో పనిచేసిన తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వం మనోహర్ రెడ్డి నాయకత్వంలో తనకు పదవి ఇచ్చి గౌరవించిందన్నారు. గుడులు, బడుల విషయంలో బిఆర్ఎస్ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను ఖండిస్తున్నామన్నారు. నిరాధార ఆరోపణలు చేయకుండా వారి వద్ద ఉన్న ఆధారాలతో ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామన్నారు. కాంగ్రెస్ నాయకులు కబ్జాలు ఎక్కడ చేశారో చూపించాలన్నారు. బీఆర్ఎస్ నాయకులు కబ్జాలు చేసినట్లుగా తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు.




