Tandur: కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ నిరసనలు రోహిత్ రెడ్డి
Tandur: కాంగ్రెస్ పాలన 1000 రోజులు పూర్తవుతున్న సందర్భంగా బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పిలుపునిచ్చారు.
Tandur: కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ నిరసనలు రోహిత్ రెడ్డి
తాండూర్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తవుతున్న సందర్భంగా, ఆ పార్టీ వైఫల్యాలను ఎండగట్టడానికి భారత రాష్ట్ర సమితి (BRS) సెప్టెంబర్ 2 నుండి సెప్టెంబర్ 8 లేదా 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిందని ఆదిశగా తాండూరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని ముందుకు సాగాలని తాండూరు మాజీ శాసనసభ్యులు పైలట్ రోహిత్ రెడ్డి పిలుపునిచ్చారు.
సోమవారం తాండూరు పట్టణంలోని బి ఆర్ ఎస్ క్యాంపు కార్యాలయంలో రోహిత్ రెడ్డి ముఖ్య నాయకులతో కలిసి సెప్టెంబర్ 2 కు సంబంధించి కార్యాచరణ పై దిశా నిర్దేశం చేశారు. అనంతరం మహిళా నాయకులు మాజీ శాసనసభ్యులు పైలట్ రోహిత్ రెడ్డికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. వారి అభిమానానికి ఆప్యాయంగా పలకరించి కృతజ్ఞతలు తెలిపారు.




