Tandur: శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా తాండూరులో పోలీసులు గస్తీ!

Tandur: తాండూరు పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు పాదరక్ష గస్తీ, ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

Srikanth Reddy, Tandur
Published on: 2 Aug 2026 7:48 AM IST
Tandur
X

Tandur: శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా తాండూరులో పోలీసులు గస్తీ!

Tandur: తాండూరు పట్టణంలో పాదరక్ష గస్తీ నిర్వహించిన పోలీసులు

తాండూరు పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు రాత్రివేళల్లో అసాధారణ కదలికలను అరికట్టే లక్ష్యంతో డీఎస్పీ ఆధ్వర్యంలో

రైల్వే స్టేషన్, పట్టణంలోని పలు ప్రాంతాల్లో, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో పోలీసులు పాదరక్ష గస్తీ మరియు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ...

మాదకద్రవ్యాల నిరోధక చర్యలో భాగంగా మాదకద్రవ్యాలను సేవించారేమోనని అనుమానిత వ్యక్తులను పరిరక్షించడానికి నార్కోటిక్ డిడక్షన్ కిట్లను ఉపయోగించడం జరిగిందన్నారు. రోడ్లపై అకారణంగా తిరుగుతున్న వారికి కౌన్సెలింగ్ నిర్వహించి, యువత అవసరం లేకుండా రాత్రి వేళల్లో బయట తిరగవద్దని సూచించారు. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని డీఎస్పీ నర్సింగ్ యాదయ్య పేర్కొన్నారు.

ఈ గస్తీ లో తాండూరు టౌన్ మరియు రూరల్ సీఐ లు, తాండూరు సబడివిజన్ ఎస్ఐ లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Srikanth Reddy, Tandur

Srikanth Reddy, Tandur

Next Story