Tandur: తాండూరు పోలీసుల మార్క్.. 24 గంటల్లోనే దొంగతనం కేసు ఛేదన!
Tandur: తాండూరులో కలకలం రేపిన నాలుగున్నర తులాల బంగారం చోరీ కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు.
Tandur: తాండూరు పోలీసుల మార్క్.. 24 గంటల్లోనే దొంగతనం కేసు ఛేదన!
Tandur: తాండూరులో చోటుచేసుకున్న బంగారం చోరీ కేసును పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. కేవలం 24 గంటల వ్యవధిలోనే నిందితుడిని పట్టుకుని, దొంగిలించిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
కేసు వివరాల్లోకి వెళ్తే..
నిన్న (జూన్ 21, 2026) తాండూరులోని భద్రేశ్వర కాంప్లెక్స్ వద్ద నాలుగున్నర తులాల బంగారం చోరీకి గురైనట్లు బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై వెంటనే స్పందించిన తాండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నిందితుడి అరెస్టు:
పోలీసులు వేగంగా దర్యాప్తు నిర్వహించి, ఈ చోరీకి పాల్పడిన చింతుపల్లీ శ్రీకాంత్ (31), అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుండి దొంగిలించిన నాలుగున్నర తులాల బంగారాన్ని పోలీసులు పూర్తిగా రికవరీ చేశారు.
ఈరోజు నిందితుడిని పోలీసులు జుడిషియల్ కస్టడీకి తరలించారు. అత్యంత తక్కువ సమయంలో కేసును ఛేదించి, బాధితులకు న్యాయం చేసిన పోలీసుల పనితీరుపై స్థానికులు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు.




