Tandur: తాండూరు నుంచి అరుణాచలానికి ప్రత్యేక ఆర్టీసీ బస్సు

Tandur: తాండూరు ప్రజల చిరకాల కోరిక మేరకు అరుణాచలానికి ప్రత్యేక బస్సును ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాల్ రెడ్డి. సహకరించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి.

Srikanth Reddy, Tandur
Published on: 4 Aug 2026 3:34 PM IST
Tandur
X

Tandur: తాండూరు నుంచి అరుణాచలానికి ప్రత్యేక ఆర్టీసీ బస్సు

తాండూరు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరుణాచలo దర్శనం కోసం ప్రజలు నిత్యం అరుణాచల క్షేత్ర అగ్ని లింగాన్ని దర్శించుకోవడానికి తహతహలాడుతారన్నారు . అలాంటి తాండూరు ప్రజల కోరిక నేడు సాకారం అయ్యింది.

స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రత్యేక చొరవతో మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి ఈ విషయంపై దృష్టి సారించడంతో తాండూరు ప్రజల అరుణాచల క్షేత్ర దర్శన కోరిక నేడు సాకారం అయ్యింది. మంగళవారం తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాల్ రెడ్డి అరుణాచల క్షేత్రానికి ప్రత్యేక బస్సును ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... సుప్రసిద్ద పుణ్య క్షేత్రమైన అరుణాచలానికి ప్రజలు వెళ్లాలని అనుకుంటారని అన్నారు. అంత గొప్ప క్షేత్రానికి వెళ్లడానికి సరియైన బస్సు సౌకర్యం లేక గతంలో ప్రయాణికులు ఇబ్బంది పడేవారన్నారు.

ఇట్టి విషయంపై ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి తాండూరు బస్ డిపో నుండి ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని అన్నారు.ప్రజలు ఈ బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రవీణ్ కుమార్,ఆర్టీసీ అధికారులు, సిబ్బంది మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Srikanth Reddy, Tandur

Srikanth Reddy, Tandur

Next Story