Tandur: చెట్టే జ్ఞాపకం వెంకటయ్య నాటిన చెట్టుకు 10వ బర్త్‌డే

Tandur: స్వర్గీయ కోట్రిక వెంకటయ్య జయంతి వేళ ఆయన నాటిన చెట్టుకు 10వ పుట్టినరోజు వేడుకలు. తాండూరులో పర్యావరణ స్పృహ, మానవీయ విలువలు చాటిన కుటుంబ సభ్యులు.

Srikanth Reddy, Tandur
Published on: 29 July 2026 2:06 PM IST
Tandur
X

Tandur: చెట్టే జ్ఞాపకం వెంకటయ్య నాటిన చెట్టుకు 10వ బర్త్‌డే

తాండూరు: మనిషి లేనప్పటికీ ఆయన నాటిన మొక్కను ప్రేమగా సంరక్షిస్తూ ప్రతి ఏడాది దానికి పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం ద్వారా తాండూరుకు చెందిన ఓ కుటుంబం పర్యావరణ పరిరక్షణతో పాటు మానవీయ విలువలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.

తాండూరు మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ కోట్రిక విజయలక్ష్మి భర్త స్వర్గీయ కోట్రిక వెంకటయ్య తన జన్మదినం సందర్భంగా 9ఏళ్ల క్రితం ఇంటి సమీపంలో ఓ మొక్కను నాటారు. అనంతరం ఆయన అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన జ్ఞాపకార్థంగా ఆ మొక్కను కుటుంబ సభ్యులు ఎంతో అపురూపంగా సంరక్షిస్తున్నారు.

ప్రతి ఏడాది ఆయన జన్మదినం రోజున ఆ చెట్టును అలంకరించి పూజలు నిర్వహిస్తూ పుట్టినరోజు వేడుకలను నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. రెండేళ్ల క్రితం ఆ చెట్టును తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రానికి సజీవంగా తరలించినప్పటికీ, అక్కడ కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.

బుధవారం స్వర్గీయ కోట్రిక వెంకటయ్య జయంతి సందర్భంగా చెట్టుకు 10వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ చైర్‌పర్సన్ కోట్రిక విజయలక్ష్మి, కుటుంబ సభ్యులు చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించి నివాళులర్పించారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు సభ్యులు కోట్రిక శ్రీకాంత్, కోడలు వాసవి మహిళా సంఘం మాజీ అధ్యక్షురాలు నాగలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Srikanth Reddy, Tandur

Srikanth Reddy, Tandur

Next Story