LB Nagar: శివచరణ్ కు ఏ హోదా లేదు. అయినా ఎలా సెక్యూరిటీ ఎలా ఇచ్చారు?

LB Nagar: యాదాద్రి ఆలయ కమిటీ బోర్డు మెంబర్ ఈశ్వరమ్మ పై జరిగిన వివక్షాపూరిత దాడిని బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 18 July 2026 1:17 AM IST
LB Nagar
X

LB Nagar: ఈశ్వరమ్మకు సెక్యూరిటీ ఇవ్వాలి: ఆర్‌ఎస్‌పీ డిమాండ్!

LB Nagar: యాదాద్రి ఆలయ కమిటీ బోర్డు మెంబర్ ఈశ్వరమ్మ యాదవ్ గారిపై వివక్షాపూరిత దాడిని ఖండిస్తున్నాం.ఎల్ బి నగర్ లో అత్యధిక మెజార్టీ తో కౌన్సిలర్ గా కూడా గెలిచారు. గత 40 ఏళ్లుగా రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు.ఒక మహిళ అని కూడా చూడకుండా దారుణంగా అవమానిస్తూ మాట్లాడి దాడి చేయడం హేయమైన చర్య.

యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ జక్కిడి శివచరణ్ రెడ్డి అవమానించి వివక్షాపూరితంగా వ్యవహరించడం దారుణం.రేవంత్ రెడ్డి భాషనే.. శివ చరణ్ రెడ్డి కూడా మాట్లాడారు.ఈశ్వరమ్మ ను అవమానించిన వెంటనే... శివ చరణ్ రెడ్డికి 1+1 గన్ మెన్ సెక్యూరిటీ ఇచ్చి తిప్పుతున్నారు.

కానీ దాడికి గురైన బాధితురాలు ఈశ్వరమ్మ 80 ఏళ్ల వయస్సులో భయం భయంగా ఇంట్లో ఉంది.కాంగ్రెస్ ప్రభుత్వం బాధితురాలికి గన్ మెన్స్ ఇవ్వకుండా..

నిందితులకు గన్ మెన్ లను ఇచ్చారు.బిసిలను,పేద వర్గాలను ఏం అన్నా నడుస్తది అనే విధంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు.మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి ఎందుకు ఈ అంశం పై మాట్లాడడంలేదు.దాడి సంఘటనపై దర్యాప్తు చేయడానికి కూడా బిసి నాయకులను నియమించలేదు.

జగ్గా రెడ్డి ,నరసింహా రెడ్డిలతో కమిటీ వేశారు. వారు బాధితులను కలిసి ఏం అడగడం లేదు.కనీసం శివ చరణ్ రెడ్డికి నోటీసులు ఇవ్వలేదు.షబ్బీర్ అలీ కి వెటనే షోకాజ్ నోటీసు ఇచ్చారా? క్రమశిక్షణ కమిటీ చైర్మెన్ మల్లు రవి వచ్చారా,ఇందిరమ్మ రాజ్యంలో ఈశ్వరమ్మకు జరిగే న్యాయం ఇదేనా?

దాడి చేసిన వాల్లకు గన్ మెన్లను ఇచ్చారు.తిట్టిన వారిని అడగడానికి వెళ్తే దారుణంగా కొట్టారు.కాంగ్రెస్ పాలనలో మహిళల మీద ఘోరమైన దాడులు జరుగుతున్నాయి.షాబాద్ లో ఆరుగురు మహిళలు హత్యకు గురయ్యారు.పోక్సో కేసుల్లో నిందితులకు బెయిల్ ఇస్తున్నారు.

మహిళల పట్ల చులకన భావంతో ప్రవర్తిస్తున్నారు.ఎందుకు సస్పెండ్ చేయడం లేదు శివచరణ్ రెడ్డిని? కాంగ్రెస్ మహిళా వ్యతిరేక పార్టీ. బహుజన వ్యతిరేక పార్టీ.బిసిలకు ముందు పదవులు ఇచ్చినట్టే ఇచ్చి,వెనుక నుండి అణిచివేస్తున్నారు.

కాంగ్రెస్ వల్లనే బెల్లి లలిత లాంటి వారు హత్యకు గురయ్యారు.ఈశ్వరమ్మ యాదవ్ గారికి గన్ మెన్ సెక్యూరిటీ ఇవ్వాలి.ఆమె యాదాద్రి బోర్డ్ మెంబర్ పదవి ఉంది.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story