Tarnaka: ఎన్నికల్లో హామీల వర్షం అధికారంలో నిర్లక్ష్యం కాంగ్రెస్‌పై సరస్వతి ఆగ్రహం
Tarnaka: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై తార్నాక మాజీ కార్పొరేటర్ ఆలకుంట సరస్వతి మండిపాటు. ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ నిరసనకు మద్దతుగా బీఆర్‌ఎస్ శ్రేణులతో ధర్నా.
Tarnaka: ఎన్నికల్లో హామీల వర్షం అధికారంలో నిర్లక్ష్యం కాంగ్రెస్‌పై సరస్వతి ఆగ్రహం
Tarnaka: కాంగ్రెస్ పార్టీ పాలనకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా తార్నాక డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆలకుంట సరస్వతి పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఎన్నికల ముందు హామీల వర్షం.. అధికారం వచ్చిన తర్వాత ప్రజలపై నిర్లక్ష్యం” ఇదే కాంగ్రెస్ ప్రభుత్వ అసలు స్వరూపమని ఆలకుంట సరస్వతి విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఒక్కొక్క హామీ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తార్నాక డివిజన్ నుంచి వందలాది మంది బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివెళ్లి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన భారీ ధర్నాకు మద్దతు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే వరకు బీఆర్‌ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తుందని నాయకులు స్పష్టం చేశారు. హామీలు అమలు చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచి హామీలు అమలు చేయించే వరకు బీఆర్‌ఎస్ పోరాటం ఆగదు” అని తార్నాక బీఆర్‌ఎస్ నాయకులు హెచ్చరించారు.
ఈ ధర్నాలో తార్నాక డివిజన్‌కు చెందిన బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు, మహిళా నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.




