Tarnaka: ఆకతాయిల అడ్డా నుండి ఆహ్లాదకర వనంగా మారిన తార్నాక జీహెచ్ఎంసి పార్కు
తార్నాక స్ట్రీట్-3 జీహెచ్ఎంసి పార్కును ఆయుర్వేదిక్ పార్కుగా మార్చనున్నట్లు నూతన వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీరామ్ వెంకటేష్ వెల్లడించారు.
Tarnaka: ఆకతాయిల అడ్డా నుండి ఆహ్లాదకర వనంగా మారిన తార్నాక జీహెచ్ఎంసి పార్కు
తార్నాక: ఆకతాయిలకు, ధూమపానానికి, తాగుబోతులకు అడ్డాగా మారిన తార్నాక స్ట్రీట్ నెంబర్ 3 లోని జీహెచ్ఎంసి పార్కును ఆయుర్వేదిక్ పార్కుగా మార్చబోతున్నట్లు నూతనంగా కాలనీ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు తీసుకున్న శ్రీరామ్ వెంకటేష్ వెల్లడించారు. ఈ మేరకు తార్నాక స్ట్రీట్ నంబర్ 3 వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీని ఈరోజు ఎన్నుకున్నారు. వెల్ఫేర్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్, వైస్ ప్రెసిడెంట్ గా శ్రీనివాస్ ను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా వారు కాలనీలోని పార్కు గత పదేళ్లుగా నిర్లక్ష్యానికి గురై పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ఈ పార్కు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారడంతో మహిళలు, యువతులు, చిన్నారులు అక్కడి నుంచి నడిచి వెళ్లేందుకు కూడా భయపడే పరిస్థితి నెలకొందన్నారు. మద్యం సేవించడం, ధూమపానం, మాదకద్రవ్యాల వినియోగం వంటి చర్యలు అక్కడ నిత్యకృత్యంగా మారడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
సుమారు 200 ఇళ్లకు చెందిన కాలనీవాసులు ఏకమై, జీహెచ్‌ఎంసీ అధికారుల సహకారంతో పార్కును పూర్తిగా శుభ్రపరిచి మళ్లీ ప్రజల వినియోగానికి అనువుగా తీర్చిదిద్దారు. దీంతో పార్కు కొత్త రూపును సంతరించుకుని కాలనీవాసులకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందిస్తోంది.




