Tarnaka: తార్నాక చింతల్‌బస్తీలో ఘనంగా అన్నదానం

Tarnaka: హైదరాబాద్ తార్నాక చింతల్‌బస్తీలోని దుర్గామాత మండపం వద్ద యంగ్‌స్టార్‌ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

HARISH, TARNAKA
Published on: 18 Oct 2026 5:27 PM IST
Tarnaka
X

Tarnaka: తార్నాక చింతల్‌బస్తీలో ఘనంగా అన్నదానం

తార్నాక: తార్నాక చింతల్‌బస్తీలో యంగ్‌స్టార్‌ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దుర్గామాత మండపం వద్ద ఆదివారం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

మురుగని రవికుమార్‌ సహకారంతో నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించిన మురుగని రవికుమార్‌ను అసోసియేషన్‌ సభ్యులు అభినందించారు.

ఈ కార్యక్రమంలో యంగ్‌స్టార్‌ యూత్‌ సభ్యులు టి. హరిబాబు, సీహెచ్‌. మనోహర్‌, సీహెచ్‌. భాస్కర్‌, వేణుగోపాల్‌రెడ్డి, ఎం. రాజు, టి. శాంతి, టి. లక్ష్మీనారాయణ, కర్ణ, వరుణ్‌, దేవా, నరేష్‌, యగ్నేష్‌, ప్రశాంత్‌, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA