Tarnaka: తార్నాక నారాయణ స్కూల్‌లో ఘనంగా ఇన్వెస్టిచర్ సెర్మనీ!
Tarnaka: తార్నాక నారాయణ సి.ఓ. పాఠశాలలో ఘనంగా ఇన్వెస్టిచర్ సెర్మనీ. విద్యార్థులకు నాయకత్వ బాధ్యతలు అప్పగించిన స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు.
Tarnaka: తార్నాక నారాయణ స్కూల్‌లో ఘనంగా ఇన్వెస్టిచర్ సెర్మనీ!
Tarnaka: విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించి, వారిని బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తార్నాక నారాయణ సి.ఓ. పాఠశాలలో ఇన్వెస్టిచర్ సెర్మనీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల జీఎం గోపాల్‌రెడ్డి, ఏజీఎం బాల పరమేశ్వరరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుబ్రమణ్య చౌదరి, ఏవో వెంకటేష్ పాల్గొని
విద్యార్థులకు వివిధ నాయకత్వ బాధ్యతలను అధికారికంగా అప్పగించి, తమ విధులను నిజాయితీ, క్రమశిక్షణతో నిర్వహిస్తామని ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం విద్యార్థులకు బ్యాడ్జీలను అందజేసి అభినందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాయకత్వం అనేది కేవలం హోదా కాదని, బాధ్యతతో కూడిన సేవాభావమని పేర్కొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, బాధ్యత, స్నేహభావం, నిజాయితీతో తమ విధులను నిర్వర్తిస్తూ పాఠశాలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని నూతనంగా బాధ్యతలు చేపట్టిన విద్యార్థులను అభినందించారు.




