Tarnaka: తార్నాక నారాయణ స్కూల్లో వనమహోత్సవం విద్యార్థుల పర్యావరణ ర్యాలీ
Tarnaka: తార్నాక నారాయణ పాఠశాలలో వనమహోత్సవం. మొక్కలు నాటిన జీఎం గోపాల్ రెడ్డి, ఎంజీఎం బాలపరమేశ్వరావు. ప్రిన్సిపాల్ పర్విన్ ఆధ్వర్యంలో విద్యార్థుల భారీ ర్యాలీ.
Tarnaka: తార్నాక నారాయణ స్కూల్లో వనమహోత్సవం విద్యార్థుల పర్యావరణ ర్యాలీ
తార్నాక: తార్నాక నారాయణ పాఠశాలలో ఘనంగా వనమహోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిఎం గోపాల్ రెడ్డి, ఎంజీఎం బాలపరమేశ్వరావు లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు చెట్ల వల్ల కలిగే ప్రయోజనాలు, కాలుష్య నివారణ మరియు పర్యావరణ సమతుల్యత గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.
పాఠశాల ప్రిన్సిపాల్ పర్విన్ విద్యార్థుల చేత మొక్కలు నాటించి, ప్రతి ఒక్కరు మొక్కలు నాటడం వలన భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కోవచ్చు అని వివరించారు. విద్యార్థుల చేత పచ్చని చెట్లు, ప్రగతికి మెట్లు", "వృక్షో రక్షతి రక్షితః"అనే నినాదాలు పలికిస్తూ ర్యాలి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
Next Story




