Tarnaka: తార్నాక సేవ-25: హనుమాన్‌నగర్‌లో ఉచిత వైద్య శిబిరం
Tarnaka: ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితం సందర్భంగా తార్నాక హనుమాన్‌నగర్‌లో డాక్టర్ శ్రీరామ్ వెంకట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య, కంటి పరీక్షల శిబిరం జరిగింది.
Tarnaka: తార్నాక సేవ-25: హనుమాన్‌నగర్‌లో ఉచిత వైద్య శిబిరం
తార్నాక: ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ సికింద్రాబాద్ మహంకాళి జిల్లా ఇంటలెక్చువల్ సెల్ కన్వీనర్ డా. శ్రీరామ్ వెంకట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తార్నాక సేవ–25లో భాగంగా హనుమాన్‌నగర్‌లో ఉచిత వైద్య, కంటి పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీరామ్ వెంకట్ మాట్లాడుతూ పేద, నిరుపేద ప్రజలు ఉచిత వైద్య సేవలు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు కూడా అందిస్తున్నామని తెలిపారు.
ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు నిర్వహించామని, తార్నాక సేవ–25లో భాగంగా మొత్తం 25 సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు పది కార్యక్రమాలు పూర్తయ్యాయని, మరో 15 కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు.
సేవా కార్యక్రమాలు ఇంతటితో ఆగవని, నిరంతరం కొనసాగిస్తానని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. హెల్త్ క్యాంపు కు సహకరించిన గ్రామ సేవ నిర్వాహకులకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.




