Tarnaka: తార్నాక టాస్క్ అసోసియేషన్ నూతన అధ్యక్షురాలిగా మంజుల సాగర్!
Tarnaka: తార్నాక కాలనీ సమస్యల పరిష్కారానికి పార్టీలకు అతీతంగా కృషి చేస్తామని టాస్క్ అసోసియేషన్ అధ్యక్షురాలు మంజుల సాగర్ తెలిపారు.
Tarnaka: తార్నాక టాస్క్ అసోసియేషన్ నూతన అధ్యక్షురాలిగా మంజుల సాగర్!
Tarnaka: కాలనీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి పార్టీలకు అతీతంగా కృషి చేస్తామని టాస్క్ అసోసియేషన్ నూతన కమిటీ అధ్యక్షురాలు మంజుల సాగర్ తెలిపారు. తార్నాకలో ఏర్పాటు చేసిన నూతన కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ మూడు సంవత్సరాలకోసారి కమిటీ ఎన్నికలు నిర్వహించే సంప్రదాయంలో భాగంగా ఇటీవల తనను అధ్యక్షురాలుగా ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు.
స్ట్రీట్ నంబర్ 2 నుంచి 19 వరకు పరిధిలోని కాలనీ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తామన్నారు. కాలనీలో వీధి దీపాలు, రహదారులు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా తదితర సమస్యల పరిష్కారానికి ఇప్పటికే జీహెచ్‌ఎంసీ, పోలీసు శాఖకు వినతిపత్రాలు అందించినట్లు తెలిపారు. కాలనీలోని నాలుగు పార్కుల అభివృద్ధికి సంబంధించి పనులు ప్రక్రియలో ఉన్నాయని వెల్లడించారు. కమిటీ సభ్యుల సహకారంతో కాలనీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు.
ఎమ్మెల్యే పద్మారావు, మాజీ మేయర్ బండ కార్తిక రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి లు కాలనీ అభివృద్ధికి సహకరిస్తున్నారని వారికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పలువురు ప్రజాప్రతినిధులు, నాయకుల సహకారంతో సమస్యల పరిష్కారానికి ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.
కాలనీలో ఎక్కడైనా వీధి దీపాలు, డ్రైనేజీ, రహదారులు లేదా ఇతర సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని నివాసితులకు సూచించారు. సమస్యలపై సంబంధిత అధికారులకు వినతిపత్రాలు అందజేసి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. కాలనీ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టాస్క్ కమిటీ సభ్యులు రామ్మోహన్ రెడ్డి, హుస్సేనీ, వీరన్న, దస్తగిరి, ఖలీద్, విజయ్ కుమార్, రాజు, హనుమాన్, రాజనర్సింహ, రాజా విమల్, సమీర్, శ్రీనివాస్, రవీంద్ర, ముజాహిల్ తదితరులు పాల్గొన్నారు




