Nagole: టీసీఎస్ మేనేజర్‌కు షాక్.. క్రెడిట్ కార్డు పేరిట రూ.3.37 లక్షలు మాయం!
Nagole: ఎల్బీనగర్ పరిధిలో ఘోర సైబర్ మోసం.
Nagole: టీసీఎస్ మేనేజర్‌కు షాక్.. క్రెడిట్ కార్డు పేరిట రూ.3.37 లక్షలు మాయం!
ఎల్బీనగర్: క్రెడిట్ కార్డు ఇప్పిస్తామని రూ.3.37 లక్షలకు టోకరా వేసిన సైబర్ కేటుగాళ్లు ఓ ప్రైవేటు సంస్థ లోని సీనియర్ ఉద్యోగికి క్రెడిట్ కార్డు ఇప్పిస్తా మంటూ సైబర్ నేరగాళ్లు రూ.3.37 లక్షలు మోసం చేశారు. నాగోలు సమీపంలోని స్నేహపురికాలనీకి చెందిన చావలి వెంకట రవికాంత్ టాటా కన్స ల్టెన్సీ సర్వీసెస్ సంస్థలో సీనియర్ మేనేజర్ పనిచేస్తున్నారు. ఆయన ఇటీవల పంజాబ్ నేషనల్ బ్యాంకు అఫీషియల్ వెబ్సైట్ పేరిట ఉన్న ఓ ఆన్లైన్ సైట్లోకి వెళ్లి క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేశాడు. ఆయనకు అదే రోజున ఓ వీడియోకాల్ వచ్చింది. అవతలి వ్యక్తి తాను బ్యాంకు ప్రతినిధినంటూ పరి చయం చేసుకున్నాడు. కొత్త క్రెడిట్ కార్డు కావాలంటే గతంలో ఉపయోగించిన క్రెడిట్ కార్డు వివరాలు తెలపాలని సూచించాడు. అత డిని నమ్మిన రవికాంత్ తన ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు వివరాలు తెలిపారు. ఆ అపరిచి తుడు ఓ వీడియో కాల్తో కేవైసీ ప్రాసెసూ పూర్తిచేశాడు. ఆ తర్వాత రవికాంత్కు తెలియ కుండానే రెండు ఖాతాల నుంచి రూ.3.37 లక్షలు మాయమయ్యాయి. మోసపోయానని బాధితుడు గుర్తించాడు. వెంటనే మల్కాజిగిరి సైబర్ప్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు.




