LB Nagar: ఇన్సూరెన్స్ పేరుతో క్రెడిట్ కార్డు నుంచి రూ.78 వేలు స్వాహా!

LB Nagar: సాఫ్ట్‌వేర్ ఉద్యోగి క్రెడిట్ కార్డు నుంచి ఇన్సూరెన్స్ పేరుతో రూ.78,947 కాజేశారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 19 Aug 2026 7:36 PM IST
LB Nagar
X

LB Nagar: ఇన్సూరెన్స్ పేరుతో క్రెడిట్ కార్డు నుంచి రూ.78 వేలు స్వాహా!

ఎల్బీనగర్: ఇన్సూరెన్స్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి క్రెడిట్ కార్డు నుంచి రూ.78,947 కాజేశారు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదైంది.

పోలీసుల వివరాల ప్రకారం.. సరస్వతి నగర్, హస్తినాపురానికి చెందిన 25 ఏళ్ల వియాపు శ్రీను సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఈ నెల 15న మధ్యాహ్నం 2.15 గంటల సమయంలో 6289043934 నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అనంతరం “insurance my axis.com” పేరుతో ఉన్న వెబ్‌సైట్ ద్వారా క్రెడిట్ కార్డు వివరాలను నమోదు చేయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కొద్దిసేపటికే ఆయన క్రెడిట్ కార్డు నుంచి రూ.78,947 అనధికారికంగా డెబిట్ అయ్యాయి.

లావాదేవీ మోసపూరితమైనదని గుర్తించిన బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా Cr.No.1101/2026 కింద BNS 318(4), 319(2), IT Act 66(C), 66(D) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సైబర్ మోసగాళ్ల వలలో పడొద్దు అనుమానాస్పద ఫోన్ కాల్స్, లింకులు, వెబ్‌సైట్ల ద్వారా ఎవరైనా క్రెడిట్/డెబిట్ కార్డు వివరాలు, OTPలు, CVVలు అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story