Hyderabad: ఏపీలో విద్యుత్ పునరుద్ధరణకు తెలంగాణ సహకారం: సీఎండీ

Hyderabad: అర్నాబ్ తుఫాన్‌తో దెబ్బతిన్న ఏపీ విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణకు తెలంగాణ నుంచి 2000 మంది సిబ్బంది, అత్యవసర వాహనాలు పంపినట్లు సీఎండీ జితేష్ పాటిల్ తెలిపారు.

GIRI, CENTRAL ZONE
Published on: 30 Oct 2026 3:18 PM IST
Hyderabad
X

Hyderabad: ఏపీలో విద్యుత్ పునరుద్ధరణకు తెలంగాణ సహకారం: సీఎండీ

Hyderabad: అర్నాబ్ తుఫాన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణకు తెలంగాణ విద్యుత్ శాఖ పూర్తి సహకారం అందిస్తోందని టీజి ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ పాటిల్ ఐఏఎస్ తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు టీజీ ఎస్పీడీసీఎల్ , టీజీ ఎంపీడీసీఎల్ నుంచి 2000 మంది సిబ్బంది, ఇంజనీర్లు అత్యాధునిక పరికరాలు ఎమర్జెన్సీ వాహనాలను ఏపీకి పంపించామని చెప్పారు.

విద్యుత్ సరఫరాను వీలైనంత త్వరగా పునరుద్ధరించి ఏపీ ప్రజలకు ఇబ్బందులు తగ్గించడమే తమ లక్ష్యం అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణ విద్యుత్ శాఖ అండగా నిలుస్తుందని అన్నారు. ఆపత్కాలంలో ఆంద్రప్రదేశ్ కు తెలంగాణ విద్యుత్ శాఖ అండగా నిలుస్తుందని స్పష్టం చేసారు.

GIRI, CENTRAL ZONE

GIRI, CENTRAL ZONE