Hyderabad: ప్రశాంతంగా ముగిసిన బార్ల లక్కీ డ్రా.. 41 బార్లకు లైసెన్సీల ఎంపిక పూర్తి

Hyderabad: తెలంగాణలో 41 నూతన బార్ల లైసెన్సుల లక్కీ డ్రా ప్రశాంతంగా ముగిసింది. హైదరాబాద్ పరిధిలో కమిషనర్ హరికిరణ్, జిల్లాల్లో కలెక్టర్లు డ్రా నిర్వహించారు.

Arun Goud, Hyderabad
Published on: 16 Oct 2026 6:06 PM IST
Hyderabad
X

Hyderabad: ప్రశాంతంగా ముగిసిన బార్ల లక్కీ డ్రా.. 41 బార్లకు లైసెన్సీల ఎంపిక పూర్తి

Hyderabad: క్యూర్ పరిధిలోని బార్ల లక్కి డ్రాను కమిషనర్ చేతుల మీదుగా 14 లైసెన్సీల ఎంపిక, జిల్లాల్లోని 27 బార్ల లక్కి డ్రా ప్రకియ కలెక్టర్ల చేతుల మీదుగా నిర్వహించిన డ్రా ప్రక్రియ ప్రశాంతం ముగిసింది. 41 బార్లకు శుక్రవారం జరిగిన లక్కి డ్రా ఆఫ్ లాట్స్ ప్రకియ ప్రశాంతంగా ముగిసింది.

క్యూర్ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి డిప్యూటి కమిషనర్ల పరిధిలోని 14 బార్లకు 4251. కార్పొరేషన్, కార్పొరేషన్, మునిసిపాలిటీ ల్లోని 27 బార్లకు 4519 దరఖాస్తులు వచ్చాయి.

క్యూర్ పరిధిలోని 14 బార్లకు ది అడ్రస్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ హల్‌లో లక్కి డ్రా ప్రకియను నిర్వహించారు. 14 బార్లకు సంబంధించిన లక్కి డ్రా ఆఫ్ లాట్స్‌ను ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సి.హరికిరణ్ చేతుల మీదుగా నిర్వహించారు.

కన్వెన్షన్ హల్‌కు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు దరాఖాస్తులు బారులుగా వచ్చాయి. 4251 మంది దరఖాస్తులకు కేటాయించిన సీట్లలో కూర్చున్నారు.

అందరి సమక్షంలో దరఖాస్తుదారులకు కేటాయించిన నెంబర్ల పరిశీలిన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం అందరి ముందు నెంబర్ల కాయిన్స్ ను ఒకె బాక్స్‌లో వేశారు.

నెంబర్ల డబ్బాను సికింద్రాబాద్ ఈఎస్ జీవన్ కిరణ్ గట్టిగా ఊపిన అనంతరం కమిషనర్ మరోమ ఆరు డబ్బాలోపల చేయి పెట్టి మరోమారో కలిపి ఒక టోకెన్ తీసి అడిషనల్ కమిషనర్ సయ్యద్ యాషిన్ ఖురేషి చేతిలో పెట్టారు.

నెంబరును మైక్‌లో ప్రకటించడం తోపాటు సీన్‌పై డీస్‌ప్లె చేశారు. ఇలా 14 మార్లు లక్కి డ్రా ద్వారా బార్ లైసెన్సీలను ఎంపిక ప్రక్రియను ప్రశాతంగా పూర్తి చేశారు.

లక్కి డ్రాలో గెలుపొందిన లైసెన్సీని ఎక్సైజ్ సిబ్బంది తీసుక వచ్చి వారికి బారు అనుమతి పత్రాలను అందించారు. ఇదే తీరులో కార్పోరేషన్, మునిసిపాలిటీల్లోని 27 బార్లకు 4519 దరఖాస్తులు వచ్చాయి.

భద్రాద్రి కొత్తగూడెంలో ఆశ్వరావ్‌పేట ఖమ్మంలోని కల్లూరు, మహబూబ్‌నగర్‌లోని మక్తల్, దేవరఖద్ర, మద్దూరు, మహాబూబ్‌నగర్, సంగారెడ్డిలో గడ్డపొతారం, గుమ్మిడాల, కోహిర్, నిజామాబాద్‌లోని బోధన:,కామారెడ్డిలో బిచ్చికుండ, ప్యూచర్ సిటీలో చెవెళ్ల , మొహిన్‌బాద్, వికారాబాద్, కొండల్, పరిగి, వరంగల్ రూరల్‌లో నర్సంపేట్ , జనగాంలో స్టేషన్ గన్‌పూర్, మహబూబ్‌బాద్ కే సముద్రం, జయశంకర్ భూపాల్‌పల్లి ములుగు జిల్లాల్లోని బార్లకు సంబంధించిన బార్లకు సంబంధించిన డ్రా ఆఫ్ లాట్స్‌ను ఆయా కలెక్టర్లు తీశారు.

క్యూర్ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి డిప్యూటి కమిషనర్ల పరిధిలోని 14 బార్లకు 4251. కార్పొరేషన్, మునిసిపాలిటీల్లోని 27 బార్లకు 4519 దరఖాస్తులు వచ్చాయి.

బార్ల లక్కి డ్రాలు ప్రశాంతంగా ముగియడంతో ఎక్సైజ్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. డ్రా ఆఫ్ లాట్స్‌ను ప్రశాంతంగా జరుగడానికి సహకరించిన దరఖాస్తులకు, కష్టపడిన ఎక్సైజ్ సిబ్బందికి కమిషనర్ అభినందనలు తెలిపారు.

కమిషనర్ వెంట అడిషనల్ కమిషనర్ సయ్యద్ యాషిన్ ఖురేషి, సైబరాబాద్, గ్రేటర్ హైదరాబాద్, మల్కాజిగిరి డిప్యూటి కమిషనర్లు జె.హరికిషన్, ఏ. శ్రీనివాసరెడ్డి , పి.ప్రణవీ, ఇతర అభికారులు ఉన్నారు.

Arun Goud, Hyderabad

Arun Goud, Hyderabad