Hyderabad: హైదరాబాద్‌లో తెలంగాణ బీజేపీ 'SIR' రెండో దశ కార్యశాల!

Hyderabad: హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) రెండో దశ కార్యశాల జరిగింది.

BABU, VEMULAWADA
Published on: 8 Aug 2026 5:03 PM IST
Hyderabad
X

Hyderabad: హైదరాబాద్‌లో తెలంగాణ బీజేపీ 'SIR' రెండో దశ కార్యశాల!

Hyderabad: ఈరోజు హైదరాబాద్‌లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) రెండో దశ కార్యశాల నిర్వహించడం జరిగింది.ఈ కార్యశాలకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్. రామచందర్ రావు గారు అధ్యక్షత వహించారు.

రాష్ట్రవ్యాప్తంగా SIR ప్రక్రియపై పార్టీ శ్రేణులకు అవగాహన కల్పిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ జాబితాలో ఉండేలా క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.ఈ కార్యశాలకు బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్‌చార్జి శ్రీ గంగాడి మోహన్ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు శ్రీ రెడ్డబోయిన గోపి గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ సిరికొండ శ్రీనివాస్ గారు హాజరయ్యారు.

BABU, VEMULAWADA

BABU, VEMULAWADA