Hyderabad: హైదరాబాద్ ఘనంగా తెలంగాణ చెఫ్స్ అసోసియేషన్ వార్షికోత్సవం
Hyderabad: ఆహార భద్రత జాతీయ బాధ్యత అని పేర్కొన్న వక్తలు. తాజ్ డెక్కన్‌లో జరిగిన తెలంగాణ చెఫ్స్ అసోసియేషన్ 7వ వార్షికోత్సవంలో పాల్గొన్న అంతర్జాతీయ చెఫ్ పాస్కల్.
Hyderabad: హైదరాబాద్ ఘనంగా తెలంగాణ చెఫ్స్ అసోసియేషన్ వార్షికోత్సవంHyderabad: హైదరాబాద్ ఘనంగా తెలంగాణ చెఫ్స్ అసోసియేషన్ వార్షికోత్సవం
హైదరాబాద్: ఆహార భద్రత కేవలం ఒక పరిశ్రమకు సంబంధించిన విషయమే కాదని, అది జాతీయ బాధ్యతని వక్తలు పేర్కొన్నారు. ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ క్యులినరీ అసోసియేషన్స్, తెలంగాణ చెఫ్స్ అసోసియే షన్ 7వ వార్షికోత్సవాలను బంజారాహిల్స్లోని హోటల్ తాజ్ డెక్కన్లోడెక్కన్లో నిర్వహించారు.
అతిథిగా ఫ్రాన్స్కు చెందిన అంతర్జాతీయ చెఫ్ పాస్కల్ లొరియో వేడుకలను ప్రారంభించారు. తెలంగాణ చెఫ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అమేయ్ మరాఠీ మాట్లాడుతూ ఆహార భద్రతా ప్రమాణాల బలోపేతానికి జీహెచ్ఎంసీ, ప్రభుత్వ సంస్థలతో కలిసి పనిచేస్తామన్నారు.
అలయన్స్ ఫ్రాంకైజ్ డైరెక్టర్ హ్యూగో కావెట్, తెలంగాణ చెఫ్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ధర్మేందర్ లాంబా, మరియు తదితరులు పాల్గొన్నారు.




