Vikarabad: వికారాబాద్ జిల్లా పోలీస్ ఉన్నతాధికారులతో ఎస్పీ సమీక్ష..
Vikarabad: డీజీపీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, ఐపీఎస్ జిల్లా పోలీస్ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.
Vikarabad: వికారాబాద్ జిల్లా పోలీస్ ఉన్నతాధికారులతో ఎస్పీ సమీక్ష..
వికారాబాద్: తెలంగాణ రాష్ట్ర గౌరవ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) నేడు రాష్ట్రంలోని పోలీస్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, ఐపీఎస్ జిల్లాలోని డిఎస్‌పి ,ఇన్స్పెక్టర్,ఎస్‌హెచ్‌ఓ అధికారులు పాల్గొన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యంగా CCTNS 2.0 (Crime and Criminal Tracking Network & Systems) పరిధిలో కేసుల దర్యాప్తు అప్‌డేషన్‌కు సంబంధించిన గడువులు, పెండింగ్ దర్యాప్తుల సకాలంలో పూర్తి, కేసు వివరాల ఆన్‌లైన్ నమోదు, డిజిటల్ రికార్డుల నిర్వహణ, SCRB (State Crime Records Bureau) నివేదికల సమర్పణ మరియు ఇతర సాంకేతిక ఆధారిత పోలీసింగ్ కార్యక్రమాలపై మీటింగ్ నిర్వహించడం జరిగింది.
అనంతరం జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, ఐపీఎస్ గారు జిల్లా లోని పోలీస్ అధికారులతో మాట్లాడుతూ, రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్లలో CCTNS 2.0 వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు.
కేసుల దర్యాప్తు పురోగతిని నిర్దేశిత గడువుల్లో అప్‌డేట్ చేయడం, నాణ్యమైన డేటా ఎంట్రీ, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి దర్యాప్తు ప్రక్రియను మరింత వేగవంతం చేయడం, SCRB నివేదికలను సకాలంలో సమర్పించడం వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
అలాగే, డిజిటల్ పోలీసింగ్ వ్యవస్థలను పూర్తిస్థాయిలో వినియోగించడం ద్వారా ప్రజలకు మరింత పారదర్శకమైన, సమర్థవంతమైన సేవలు అందించవచ్చని పేర్కొన్నారు. ప్రతి పోలీసు అధికారి సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకుని, రాష్ట్ర పోలీసు శాఖ లక్ష్యాల సాధనకు కృషి చేయాలని ఎస్పీ గారు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డిసిఆర్‌బి డిఎస్‌పి జానయ్య, డిటిసి డిఎస్‌పి శ్రీనివాస్, వికారాబాద్ డిఎస్‌పి అంజయ్య, తాండూర్ డిఎస్‌పి యాదయ్య, పరిగి డిఎస్‌పి శ్రీనివాస్ , ఏఆర్ డిఎస్‌పి వీరేష్, ఇతర అధికారులు జిల్లా పోలీసు కార్యాలయానికి చెందిన అధికారులు, విభాగాధిపతులు మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.




