Tandur: తాండూరులో తెలంగాణ అవతరణ వేడుకలు

Tandur: మున్సిపల్ ఆఫీసులో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి.. కాంగ్రెస్ మార్క్ పాలనపై బీఆర్ఎస్ నేత నరేందర్ గౌడ్, రాజు గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 2 Jun 2026 12:52 PM IST
Tandur
X

Tandur: తాండూరులో తెలంగాణ అవతరణ వేడుకలు

తాండూర్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమం, అమరుల త్యాగాలను స్మరిస్తూ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. మంగళవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తాండూరు పట్టణ కేంద్రంలోని మునిసిపల్ కార్యాలయ ఆవరణలో మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డితో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు.రాష్ట్ర సాధన కోసం పోరాడిన అమరవీరులను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ...

ప్రతి సంవత్సరం జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని, రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించి, అమరులకు నివాళులు అర్పిస్తున్నామన్నారు. ఎన్నో త్యాగాలు, ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు.

తెలంగాణ ఆవిర్భావం కేవలం పరిపాలనా విభజన మాత్రమే కాకుండా, ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులను స్మరించుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతామన్నారు.

మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నివాసం, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాతో పాటు, తెలంగాణ జెండాను వర్కింగ్ ప్రెసిడెంట్ నరుకుల నరేందర్ గౌడ్ ఆవిష్కరించారు.

నరేందర్ గౌడ్ మాట్లాడుతూ...

తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిన అమరుల త్యాగాలు ఎప్పుడు మర్చిపోమన్నారు. తెలంగాణ దశ దిశ మార్చిన బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యవేక్షణలో ముందుకు సాగుతామన్నారు. రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తంగా ఉందన్నారు. తిరిగి బీఆర్ఎస్ అధికారం చేపట్టడం ఖాయమన్నారు.

అనంతరం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో నాయకులు మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్ మాట్లాడుతూ...

రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో సామాన్య ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. రాష్ట్ర సాధన కోసం పులి నోట్లో తలపెట్టి ప్రాణాలకు తెగించి ఆమరణ నిరాహార దీక్షతో రాష్ట్రం సాధించిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో 10 సంవత్సరాలు రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. ఆడు గ్యారెంటీలు 420 హామీలు అంటూ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story