Hyderabad: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీలకు కీలక పదవులు

Hyderabad: తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు కీలక ఎమ్మెల్సీలకు రాష్ట్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది.

Saleem, Nalgonda
Published on: 15 July 2026 7:30 AM IST
Hyderabad
X

Hyderabad: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీలకు కీలక పదవులు

Hyderabad: తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలకు రాష్ట్ర ప్రభుత్వం కీలక పదవులను కట్టబెట్టింది. శాసనమండలి సభ్యులు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌లకు రాష్ట్ర మంత్రి హోదా కల్పిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

​వీరి పూర్తి పదవీకాలం ముగిసే వరకు ఈ క్యాబినెట్ హోదా అమల్లో ఉంటుందని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించేందుకే వీరికి ఈ హోదా కల్పించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నిర్ణయం పట్ల కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story