Guduru: నేతన్నల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి పెద్దపీట!

Guduru: తెలంగాణలో చేనేత, పవర్‌లూమ్ కార్మికుల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్ తెలిపారు.

G. Rama Krishna, Hyderabad
Published on: 28 Sept 2026 6:59 PM IST
Guduru
X

Guduru: తెలంగాణ రాష్ట్ర పద్మశాలి కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్ మరియు హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ దూడెం వెంకటరమణ,హ్యాండ్లూమ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ జక్కని అనిత,PCC వైస్ ప్రెసిడెంట్ సంగిశెట్టి జగదీష్ పాల్గొన్న ఈ ప్రెస్ మీట్ లో గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ చేనేత, వస్త్ర రంగ అభివృద్ధితో పాటు పవర్‌లూమ్ కార్మికులు, చేనేత కార్మికుల సంక్షేమానికి బీసీల పక్షపాతి ఐన ప్రజా ప్రభుత్వంలోని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో చొరవ తీసుకొని చేనేత కార్మికులకు పెండింగ్ బకాయిల చెల్లింపులు, యార్న్ డిపో ఏర్పాటు, ప్రభుత్వ ఆర్డర్లు, మగ్గాల ఆధునీకరణ, పవర్‌లూమ్ విద్యుత్ సబ్సిడీ వంటి అంశాల్లో చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో 2021-22, 2022-23 సంవత్సరాలకు వివిధ శాఖల నుంచి TGSCOకి రావాల్సిన రూ.488.38 కోట్ల బకాయిలు ఉండగా, ప్రస్తుతం రూ.352.35 కోట్లను పెండింగ్‌లో ఉన్న సిరిసిల్లలోని MACS, SSI యూనిట్లకు చెల్లించినట్లు

వేములవాడలో యార్న్ డిపోకు చర్యలు

పవర్‌లూమ్ ఆసామీలకు డీ-మార్గిన్ అందించేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో TGSCO నోడల్ ఏజెన్సీగా యార్న్ డిపో ఏర్పాటు చేసేందుకు 05.10.2024న G.O.Ms.No.18, Industries & Commerce (Tex) ద్వారా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు యార్న్ డిపో నిర్వహణ కోసం రూ.50 కోట్ల కార్పస్ నిధి ఏర్పాటు చేసినట్లు అలాగే 2,478 పవర్‌లూమ్ యూనిట్లకు రూ.65.94 కోట్ల విలువైన యార్న్‌ను యార్న్ డిపో ద్వారా MAC సంఘాలకు సరఫరా చేసినట్లు, ప్రభుత్వ ఆర్డర్లతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఊతం 2024-25 సంవత్సరంలో ప్రభుత్వ స్కూల్ యూనిఫార్మ్ ఆర్డర్లలో సిరిసిల్లలోని మగ్గాల సంఘాలకు 77.47 లక్షల మీటర్ల వస్త్రానికి రూ.42.93 కోట్ల విలువైన ఆర్డర్లు లభించాయి.

2025-26లో ప్రభుత్వ స్కూల్ యూనిఫార్మ్‌ల కోసం 75.59 లక్షల మీటర్లకు రూ.37.67 కోట్ల విలువైన వస్త్రాన్ని సిరిసిల్లలోని మగ్గాల సంఘాల ద్వారా కొనుగోలు చేయగా, టెక్స్‌టైల్ పార్క్‌లోని రాపియర్ యూనిట్ల ద్వారా 62.79 లక్షల మీటర్లకు రూ.49.90 కోట్ల విలువైన వస్త్రాన్ని కొనుగోలు చేసినట్లు వివరించారు,

2026-27లో ఇప్పటివరకు ప్రభుత్వ యూనిఫార్మ్ ఆర్డర్లలో 14.06 లక్షల మీటర్లకు రూ.8.13 కోట్ల విలువైన ఆర్డర్లు వచ్చినట్లు తెలిపింది. IMS సారీస్‌కు సంబంధించి 2025-26లో 748.82 లక్షల మీటర్లు – రూ.276.75 కోట్లు, 2026-27లో 470.31 లక్షల మీటర్లు – రూ.159.90 కోట్లు విలువైన ఉత్పత్తులు పెరుగనున్నాయని ఈ సందర్భంగా తెలిపారు.

ఇందిరా మహిళా శక్తి చీరలకు ప్రత్యేక ప్రాధాన్యం

తెలంగాణ రాష్ట్రంలోని 18 సంవత్సరాలు నిండిన మహిళలందరికీ నాణ్యత కలిగిన ప్రత్యేక చీరలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పేర్కొంది. 2025-26లో 6.87 కోట్ల మీటర్ల చీరల వస్త్రాన్ని సిరిసిల్లలోని మగ్గాల సంఘాల ద్వారా ఉత్పత్తి చేసి సరఫరా చేసినట్లు. దీని ద్వారా సిరిసిల్ల పవర్‌లూమ్ కార్మికులకు 8 నెలల నిరంతర పని కల్పించబడినట్లు వెల్లడించింది. అలాగే 2026-27లో 3.08 కోట్ల మీటర్ల చీరల వస్త్రానికి మొదటి విడతగా, రెండో విడతలో 1.62 కోట్ల మీటర్ల వస్త్రానికి ఆర్డర్లు ఇచ్చినట్లు పవర్‌లూమ్ విద్యుత్ రాయితీ కొనసాగింపు.

పవర్‌లూమ్ కార్మికులకు విద్యుత్ రాయితీ పథకాన్ని కొనసాగిస్తూ, ప్రభుత్వం 8 శాతం సబ్సిడీ అందిస్తున్నట్లు తెలియజేశారు ఈ పథకం ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 4,963 పవర్‌లూమ్ యూనిట్లకు రూ.12.41 కోట్ల మేర ప్రయోజనం కల్పించినట్లు

అలాగే పవర్‌లూమ్ వీపర్/వీవర్ సమాజం కోసం మూడో దశ సొసైటీ ఏర్పాటు ప్రక్రియ చేపట్టినట్లు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 5,534 మంది పవర్‌లూమ్ కార్మికులు, అనుబంధ కార్మికులకు ప్రయోజనం కల్పించే చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఇందుకోసం ప్రభుత్వం వాటా జోన్ నిధులుగా రూ.57.59 కోట్లను విడుదల చేసినట్ల చేనేత, పవర్‌లూమ్ రంగాన్ని బలోపేతం చేయడం, కార్మికులకు నిరంతర ఉపాధి కల్పించడం, సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ప్రభుత్వ ఆర్డర్లను పెంచడం ద్వారా నేతన్న కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలిపారు.

ఈనెల 30వ తారీఖున రాజన్న సిరిసిల్ల లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో పద్మశాలి సోదరులు సోదరీమణులు అధిక సంఖ్యలో పాల్గొని ముఖ్యమంత్రికి చేదోడుగా నిలవాలని మన పద్మశాలి జన సందోహాన్ని చూసి మన ఉమ్మడి జిల్లాల నుంచి కనీసం నలుగురు ఎమ్మెల్యేలు గా ప్రతినిత్యం వహించేలా చర్యలు తీసుకుంటారని ఇక నుండి పద్మశాలీలు ఒకే మాట పై ఒకే తాటిపై నిలబడి ప్రజా ప్రభుత్వానికి బాసటగా ఉండాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

G. Rama Krishna, Hyderabad

G. Rama Krishna, Hyderabad