Danam Nagender: ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు!
Danam Nagender: ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు. అనర్హత వేటు వేస్తూ స్పీకర్ నిర్ణయం కొట్టివేత. బీఆర్‌ఎస్, బీజేపీ పిటిషన్లను అనుమతించిన న్యాయస్థానం.
Danam Nagender: ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు!
Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు తెలంగాణ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యే దానం అనర్హత విషయంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఆయనపై అనర్హత వేటు వేస్తూ (సీజే) ధర్మాసనం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది.
బీఆర్‌ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారని, అంతేకాకుండా 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారని పిటిషనర్లు పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.
పార్టీ ఫిరాయింపులపై స్పీకర్‌కు పక్కా ఆధారాలు సమర్పించినప్పటికీ.. వాటిని పరిగణనలోకి తీసుకోకుండా, సరైన ఆధారాలు లేవంటూ మార్చి 11న స్పీకర్ ట్రైబ్యునల్ ఉత్తర్వులు ఇచ్చిందని పిటిషనర్లు ధర్మాసనం దృష్టికి తెచ్చారు.
ఈ పిటిషన్‌పై పూర్తి స్థాయిలో విచారణ జరిపిన సీజే ధర్మాసనం.. స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేసింది. అలాగే ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు స్పీకర్ మరియు ఎన్నికల సంఘానికి (EC) కోర్టు సమాచారం అందించింది.




