Hyderabad: పాలిటెక్నిక్ కళాశాలల పీపీపీ ఉపసంహరణపై హర్షం

Hyderabad: ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో పీపీపీ విధానాన్ని ఉపసంహరించుకుంటూ జీఓ 157 జారీ చేయడంపై తెలంగాణ పాలిటెక్నిక్ జేఏసీ హర్షం వ్యక్తం చేసింది.

GIRI, CENTRAL ZONE
Published on: 16 Nov 2026 11:11 PM IST
Hyderabad
X

Hyderabad: పాలిటెక్నిక్ కళాశాలల పీపీపీ ఉపసంహరణపై హర్షం

హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానం అమలును ఉపసంహరించుకుని, కళాశాలల కొనసాగింపునకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై తెలంగాణ పాలిటెక్నీక్ జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు జారీ చేసిన జీఓ ఎంఎస్ నంబర్ 97ను, జీఓ ఎంఎస్ నంబర్ 157 ద్వారా సవరించడాన్ని స్వాగతించింది.

ఈ నిర్ణయంతో 59 ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 35 రోజులుగా కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళనకు పరిష్కారం లభించిందని పేర్కొంది. మసాబ్‌ట్యాంక్‌లో ప్రభుత్వ పాలిటెక్నీక్ కాలేజీలో నిర్వహించిన సమావేశంలో జేఏసీ చైర్మన్ నాగరాజు , అడ్వైజర్ చంద్రశేఖర్ లు మాట్లాడుతూ.. విద్యార్థుల ఆందోళనను ప్రభుత్వం అర్థం చేసుకుని సానుకూల నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, ఉన్నతస్థాయి కమిటీకి సహకరించిన కే. కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, ఇంధన శాఖ కార్యదర్శి, సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్, ఇతర అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ పాలిటెక్నిక్‌లపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో విశ్వాసం పెంపొందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం సంతోషకరమన్నారు.

GIRI, CENTRAL ZONE

GIRI, CENTRAL ZONE