Hyderabad: ఓయూలో జన సమితి ప్లీనరీ పోస్టర్ ఆవిష్కరణ
Hyderabad: తెలంగాణ జన సమితి నాలుగో రాష్ట్ర ప్లీనరీ మే 12న హైదరాబాద్ జలవిహార్‌లో జరగనుంది.
Hyderabad: ఓయూలో జన సమితి ప్లీనరీ పోస్టర్ ఆవిష్కరణ
Hyderabad: తెలంగాణ జన సమితి పార్టీ నాల్గవ రాష్ట్ర ఫ్లీనరీని విజయవంతం చేయాలని జనసమితి విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు మాసంపల్లి అరుణ్ కుమార్ పిలుపునిచ్చారు. ప్లీనరీ కి సంబంధించిన గోడ పత్రికను విద్యార్థి జన సమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆవిష్కరించారు.
ఓయూ కమిటీ చెరుకు శివరాజ్, రమేష్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు మాసంపల్లి అరుణ్ కుమార్ హజరై మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం లో తన వంతు పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాం రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఉద్యమ ఆకాంక్షల సాధనకై ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధనకు ఏర్పాటు చేసిన తెలంగాణ జన సమితి పార్టీ నాల్గవ ఫ్లీనరీ మే 12 వ తేదీన హైదరాబాద్ లోని జలవిహార్ లో జరుగుతుందని తెలిపారు.
ఈ ప్లీనరీలో రాష్ట్రంలోని విద్యార్తుల స్కాలర్షిప్, ఫీ రియంబర్స్మెంట్ తదితర విద్యా సమస్యలపై చర్చించడంతోపాటు రాష్ట్రంలోని వివిధ సమస్యలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడం జరుగుతుందన్నారు. ఈ ప్లీనరీలో మేధావులు, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థి జన సమితి రాష్ట్ర కార్యదర్శి మాలోత్ రవి కుమార్, రాష్ట్ర కార్యదర్శి జిల్లా పెల్లి దిలీప్ కుమార్ , విద్యార్థి జనసమితి ఓయూ నాయకులు, ఎల్లేష్, ముసేబ్, రిషి, యాకూబ్, అయూబ్, శివ, సాయికుమార్, అమృత, అక్షిత, యామిని, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.




