Ponguleti: విధుల్లో చేరని సర్వేయర్ల లైసెన్సులు రద్దు చేయండి.. మంత్రి!
Ponguleti: తెలంగాణలో మార్చి 2027 నాటికి మూడు విడతల్లో భూ రీ-సర్వే పూర్తి చేయడమే లక్ష్యమని, రైతుల భూములకు భద్రత కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి పొంగులేటి.
Ponguleti: విధుల్లో చేరని సర్వేయర్ల లైసెన్సులు రద్దు చేయండి.. మంత్రి!
పొంగులేటి: భూ రీ-సర్వేకు అత్యంత ప్రాధాన్యం : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మార్చి 2027 నాటికి మూడు విడతల్లో రాష్ట్రవ్యాప్తంగా రీ-సర్వే పూర్తి.
ప్రతి జిల్లాలో తొలి విడతగా 70 గ్రామాల్లో రీ-సర్వే ప్రారంభం ప్రతి నెల వీడియో కాన్ఫరెన్స్‌తో పురోగతి సమీక్ష రైతుల భూములకు పూర్తి భద్రతే ప్రభుత్వ లక్ష్యం భూ భారతి సమర్థవంతమైన అమలుకు రీ-సర్వే తప్పనిసరి.
పైలట్ రీ-సర్వేతో 95% భూ సమస్యలు పరిష్కారమయ్యాయి లైసెన్స్ సర్వేయర్లకు ఎకరానికి రూ.60 చెల్లింపు విధుల్లో చేరని లైసెన్స్ సర్వేయర్ల లైసెన్సులు రద్దు చేయాలి.
9.26 లక్షల సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి తిరస్కరణల కారణాలు గుర్తించి నిబంధనల ప్రకారం పరిష్కరించాలి. 22A నిషేధిత జాబితా సమస్యలను వెంటనే పరిష్కరించాలి
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలి 2BHK ఇళ్లను ప్రస్తుత స్థితిలోనే లబ్ధిదారులకు అప్పగించాలి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లలో గుడిసెల్లో నివసించే కుటుంబాలకు తొలి ప్రాధాన్యం.
ఆగస్టు 15 నాటికి ప్రతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి కనీసం ఒక జత యూనిఫాం అందించాలి.




