Kapra: ఈసీఐఎల్ నుంచి కుషాయిగూడ వరకు భారీ తిరంగా ర్యాలీ!

Kapra: కాప్రా కుషాయిగూడలో తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహణ. ఈసీఐఎల్ నుంచి భారీ తిరంగా ర్యాలీ, మోదీ బర్త్‌డే సందర్భంగా హనుమాన్ ఆలయంలో పూజలు చేసిన ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్.

ASHOK, KAPRA
Published on: 17 Sept 2026 10:37 PM IST
Kapra
X

Kapra: ఈసీఐఎల్ నుంచి కుషాయిగూడ వరకు భారీ తిరంగా ర్యాలీ!

కాప్రా: నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో అమరులైన వీరుల త్యాగాలను స్మరించుకుంటూ, 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన సందర్భంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను కుషాయిగూడ డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

డివిజన్ బీజేపీ అధ్యక్షుడు చల్లా ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈసీఐఎల్ చౌరస్తా నుంచి కుషాయిగూడ బస్టాండ్ వరకు భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. సేవా సంకల్పం కన్వీనర్ జంగీర్, కో-కన్వీనర్ భాను నేతృత్వంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ హాజరయ్యారు.

అనంతరం జాతీయ జెండాను ఎగురవేసి, దేశభక్తి నినాదాలతో కార్యక్రమాన్ని నిర్వహించారు. 150వ వందేమాతరం ఉత్సవాల సందర్భంగా సామూహికంగా వందేమాతరం గీతాన్ని ఆలపించారు.

అనంతరం భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా కుషాయిగూడ బస్ స్టాప్ సమీపంలోని శ్రీ కార్యసిద్ధి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు, ప్రజలకు మిఠాయిలు, పండ్లు పంపిణీ చేసి ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాసుల సురేందర్ గౌడ్, రైల్వే బోర్డు సభ్యులు మచ్చ లక్ష్మణ్ గౌడ్, డి. నాదం, ఉప్పల్ అసెంబ్లీ ఓబీసీ మోర్చా కన్వీనర్ తాళ్ల ఆనంద్ గౌడ్, సీనియర్ నాయకులు రేగొండ వెంకులు, పుట్ట సహదేవ్ గౌడ్, డివిజన్ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు పాండు ముదిరాజ్, లక్ష్మీనారాయణ, గణేష్ గౌడ్, దయానంద్, అశోక్, శంకర్ వంశరాజ్, బొల్లా శ్రీనివాస్, రాంబాబు, అప్పి నాయక్, అనిల్, వివేక్, నాలాచెరువుల జనార్దన్, పాండు ముదిరాజ్, మహిళా మోర్చా అధ్యక్షురాలు కలావతి, రామ్ తదితరులు పాల్గొన్నారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA