Bashirbagh: నేపాలీలందరినీ దొంగలుగా చిత్రీకరించవద్దు.. నేపాలీ సంఘాల ఆవేదన!

Bashirbagh: తెలంగాణలో నేపాలీ కూలీల పేరుతో జరుగుతున్న దుష్ప్రచారాన్ని 'తెలంగాణ నేపాలీస్ వెల్ఫేర్ అసోసియేషన్' తీవ్రంగా ఖండించింది.

GIRI, CENTRAL ZONE
Published on: 29 Jun 2026 4:53 PM IST
Bashirbagh
X

Bashirbagh: నేపాలీలందరినీ దొంగలుగా చిత్రీకరించవద్దు.. నేపాలీ సంఘాల ఆవేదన!

Bashirbagh: తెలంగాణ లో నేపాలీ కూలీలా పేరుతో దొంగతనాలకు పాల్పడుతున్నారని దుష్ప్రచారం చేయడం పై తెలంగాణ నేపాలిస్ వెల్ఫోర్ అసోసియేషన్ తీవ్రంగా కండించింది.కొంతమంది నేపాలీ సంఘ విద్రహా షెక్తులు ఇలాంటి పనులు చేయడం వల్ల నేపాలీ సమాజానికి చెడ్డపేరు వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు.

హైద్రాబాద్, బషీర్భాగ్ లో తెలంగాణ నేపాలిస్ వెల్ఫేర్ అసోసియేషన్,తెలంగాణ నేపాలీ మహాసభ సంయుక్త ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు రతన్ సింగ్ కర్మా మాట్లాడుతూ.. ఈ మధ్యకాలంలో నగరంలోని పలు చోట్ల నేపాలీ దొంగతనాలు జరగడం వల్ల నేపాలీ సమాజానికి ఎంతో చెడ్డ పేరు వచ్చింది.

భారత దేశంలో తమ తాతల కాలం నుండి ఘర్కా సెక్యురిటి చేసుకుంటూ నేపాళీలు ఎంతో మంచి పేరు సంపాదించారు.ఇప్పుడు కొందమంది నేపాలీ సంఘవిద్రోహ షెక్తుల దుష్చర్యలతో నేపాలీల మనుగడుగడకు ఎంతో ముప్పు ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్రంలో 40వేల నుండి 50వేల మంది జీవనోపాది పొందుతున్నారని తెలిపారు.

నేపాలిలను పనిలో పెట్టుకోవాలి లేదా ఎవరిపైన ఐన అనుమానం ఉన్న తమ సమాజాన్ని సంప్రదించాలని తెలంగాణ సమాజానికి ప్రత్యేకంగా కోరారు. నిజమైన నేపాళీలా కాదా అని తమ అసోసియేషన్ దర్యాప్తు చేసి ఒక పత్రాన్ని స్టాంపు ముద్రతో అందజేస్తామని చెప్పారు. అప్పుడు కూడా ఎవరైనా ఇలా చేస్తే తమ అసోసియేషన్ బాధ్యత వహిస్తుందన్నారు.ఎలాంటి క్రైం జరగకుండా వాళ్ల పూర్తి వివరాలు తమవద్ద ఉంటాయని చెప్పారు.కోట్ల ఆస్తులకు తమ నేపాలీ సెక్యూరిటీలుగా పనిచేస్తున్నారు.ఇది దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ సావోకర్యం కల్పించాలని కోరారు.

GIRI, CENTRAL ZONE

GIRI, CENTRAL ZONE

Next Story