Mahabubabad: దేశంలోనే తెలంగాణ పోలీస్ నంబర్ 1మహబూబాబాద్ సిఐకి గుర్తింపు!

Mahabubabad: కేంద్ర హోంశాఖ MHA పోర్టల్స్ పెర్ఫార్మెన్స్‌లో తెలంగాణ నంబర్-1. బాధితుల సొమ్ము రికవరీలో మహబూబాబాద్ టాప్; సిఐ నరేష్‌ను సన్మానించిన టీజీసిఎస్బి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 15 Aug 2026 10:11 AM IST
Mahabubabad
X

Mahabubabad: దేశంలోనే తెలంగాణ పోలీస్ నంబర్ 1మహబూబాబాద్ సిఐకి గుర్తింపు!

Mahabubabad: కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఎంఆర్ఎం (మనీ రెస్టోరేషన్ మోడెల్) కేటగిరీలో మహబూబాబాద్ జిల్లా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచి సత్తా చాటింది. బాధితుల డబ్బును తిరిగి రికవరీ చేసి వారికి అందించడంలో అధికారులు చూపిన చొరవ, వేగవంతమైన చర్యలకు ఈ గుర్తింపు లభించింది.

సీఐ నరేష్‌కు ప్రశంసలు

మహబూబాబాద్ జిల్లాలో ఎంహెచ్ఏ పోర్టల్స్ పనితీరు మెరుగుపడటంలో సీఐ కే. నరేష్ కృషి కీలకంగా నిలిచింది. సమన్వయంతో పనిచేస్తూ పోర్టల్ సంబంధిత కేసుల పరిష్కారంలో చూపిన ప్రత్యేక చొరవకు గుర్తింపుగా ఆయనకు ప్రశంసా పత్రం అందజేశారు.

ఈ అవార్డు కార్యక్రమంలో టీజీసిఎస్బి డీజీపీ శిఖా గోయల్ ప్రముఖ సినీ నటుడు హీరో నాగార్జున తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ పోలీసులకు దేశస్థాయిలో లభించిన ఈ గుర్తింపు రాష్ట్ర పోలీసు శాఖ పనితీరుకు మరో ప్రతిష్ఠాత్మక మైలురాయిగా నిలిచింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story