Talakondapally: జాతీయ జెండా ఆవిష్కరించిన సర్పంచ్ డోకురి సునీత ప్రభాకర్‌రెడ్డి!

Talakondapally: తలకొండపల్లి మండలం పడకల్‌లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం. జాతీయ జెండా ఆవిష్కరించిన సర్పంచ్ సునీత ప్రభాకర్‌రెడ్డి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, గ్రామాభివృద్ధిపై ప్రసంగం.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 17 Sept 2026 10:30 PM IST
Talakondapally
X

Talakondapally: జాతీయ జెండా ఆవిష్కరించిన సర్పంచ్ డోకురి సునీత ప్రభాకర్‌రెడ్డి!

తలకొండపల్లి: జాతీయ సమైక్యతా దినోత్సవం, ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని తలకొండపల్లి మండలం పడకల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ డోకురి సునీత ప్రభాకర్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ సునీత ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి సహకారంతో గ్రామంలో పేదలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

సన్నబియ్యం, ఉచిత విద్యుత్, సబ్సిడీపై గ్యాస్ సిలిండర్లు, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, ఇందిరమ్మ ఇళ్లు, రైతులకు సబ్సిడీపై సింప్లర్ పైపులు, సీసీ రోడ్లు, అండర్‌డ్రైనేజీ, ఐమాక్స్ లైట్లతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని పేర్కొన్నారు.

జాతీయ సమైక్యత, ప్రజాస్వామ్య విలువలు, దేశ సమగ్రతను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆమె అన్నారు. ప్రజా సంక్షేమం, గ్రామ అభివృద్ధికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి రమాదేవి, ఉప సర్పంచ్ రాఘవేందర్‌గౌడ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY