Somajiguda: నిస్వార్థ సేవకులను పెద్దల సభకు పంపాలి: నరాల సత్యనారాయణ!
Somajiguda: ఖమ్మం-వరంగల్-నల్గొండ, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ అభ్యర్థులను టీఆర్ఎస్ (డి) అధ్యక్షుడు నరాల సత్యనారాయణ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ప్రకటించారు.
Somajiguda: నిస్వార్థ సేవకులను పెద్దల సభకు పంపాలి: నరాల సత్యనారాయణ!
సోమాజిగూడ: నిస్వార్థంగా సేవలందించే వారిని పెద్దల సభకు పంపించాలని తెలంగాణ రక్షణ సమితి (డి) అధ్యక్షుడు నరాల సత్యనారాయణ విద్యావంతులకు విజ్ఞప్తి చేశారు.
సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తమ పార్టీ నుంచి ఖమ్మం వరంగల్ నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థిగా శంకర్ రెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్ మహబూబ్నగర్ అభ్యర్థిగా డప్పు స్వామి లు బరిలోకి దిగుతున్నట్లు తెలిపారు.
ఉన్నత విద్యావంతులు పెద్ద ఎత్తున హోటల్ గా నమోదు చేసుకొని సేవే లక్ష్యంగా పనిచేస్తున్న వారిని ఎన్నుకోవడం ద్వారా ప్రజా సమస్యలను పెద్దల సభలో నిలదీసి పరిష్కరించుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. ప్రజాపాలన అందిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కానీ తెలంగాణ తెచ్చామని చెబుతున్న డిఆర్ఎస్ కానీ తెలంగాణ ప్రజలకు చేసింది ఏమీ లేదని విమర్శించారు.




