Quthbullapur: తెలంగాణ వ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమైన ఆర్టీసీ ఎన్నికలు!

Quthbullapur: తెలంగాణలో ఉత్కంఠ రేపుతున్న ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ప్రారంభం. ఉదయం 5 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్. కుత్బుల్లాపూర్ జీడిమెట్ల డిపో విశేషాలు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 9 Oct 2026 8:41 AM IST
Quthbullapur
X

Quthbullapur: తెలంగాణ వ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమైన ఆర్టీసీ ఎన్నికలు!

Quthbullapur: నేడు ఆర్టీసీలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు. ఉదయం 5 నుంచి సాయంత్రం 6 వరకు ఎన్నికలు. గ్రేటర్ హైదరాబాద్ జోన్లో 32, హైదరాబాద్ జోన్లో 38, కరీంనగర్ జోన్లో 45 పోలింగ్ బూత్లు ఏర్పాటు.

రాష్ట్ర స్థాయి గుర్తింపు సంఘం కోసం ఒకటి, రీజియన్ స్థాయి గుర్తింపు సంఘం కోసం మరో ఓటు వినియోగించుకోనున్న కార్మికులు. ఎంప్లాయిస్ యూనియన్ కూటమి తెలంగాణ వర్కర్స్ యూనియన్ కూటముల మధ్య ప్రధాన పోరు.

ఈ ఎన్నికల్లో మొత్తం ఓటర్లు 34,899 మంది. ఇందులో కండక్టర్లు 14,514 మంది, డ్రైవర్లు 13,769, గ్యారేజీ సిబ్బంది 4,207, ఇతరులు 2,409 మంది ఉన్నారు. జోన్ల వారీగా చూస్తే అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ జోన్లో 13,797 మంది, కరీంనగర్ జోన్లో 11,392, హైదరాబాద్ జోన్లో 9,303, ప్రధాన కార్యాలయంలో 274, బస్ బాడీ యూనిట్ మియాపూర్లో 133 మంది. దూరప్రాంత సర్వీసుల్లో డ్యూటీలో ఉన్న ఉద్యోగుల్ని దృష్టి లో పెట్టుకుని 14, 15 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్.

కుత్బుల్లాపూర్ లోని జీడిమెట్ల ఆర్టీసీ డిపోలో ప్రశాంతంగా ప్రారంభమైన ఆర్టీసీ గుర్తింపు యూనియన్ ఎన్నికలు. ఉదయం 5 గంటల నుండి ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్. ఉద్యోగులు తమ తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR