Hyderabad: ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లపై ప్రత్యేక ఫోకస్.. కీలక భేటీ!

Hyderabad: హైదరాబాద్‌లోని ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య నేతృత్వంలో కీలక సమీక్షా సమావేశం జరిగింది.

KARUNAKAR,	DUBBAK
Published on: 24 Jun 2026 10:45 AM IST
Hyderabad
X

Hyderabad: ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లపై ప్రత్యేక ఫోకస్.. కీలక భేటీ!

Hyderabad: ఇంజనీర్ ఇన్ చీఫ్ (పబ్లిక్ హెల్త్) కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు సంబంధించిన బ్యాక్‌లాగ్ ఖాళీలు, పదోన్నతులు (Promotions), రోస్టర్ పాయింట్ల అమలు మరియు ఇతర ఉద్యోగ సంబంధిత సమస్యలపై తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ గౌరవ శ్రీ బక్కి వెంకటయ్య గారి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించబడింది.

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు రాజ్యాంగబద్ధంగా కల్పించిన రిజర్వేషన్లు, పదోన్నతుల అవకాశాలు మరియు రోస్టర్ విధానాన్ని పారదర్శకంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. శాఖలో ఉన్న బ్యాక్‌లాగ్ ఖాళీలను గుర్తించి వాటిని త్వరితగతిన భర్తీ చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

అలాగే ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు సానుకూలంగా పరిశీలించి, చట్టబద్ధమైన హక్కులు వారికి అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఉద్యోగుల సంక్షేమం, సేవా భద్రత మరియు సమాన అవకాశాల కల్పనలో ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK

Next Story