Tarnaka: జూన్ 29న 'విజయ సంకల్ప యాత్ర'..
Tarnaka: తార్నాకలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం ప్రతినిధులు సమావేశమయ్యారు.
Tarnaka: జూన్ 29న 'విజయ సంకల్ప యాత్ర'..
తార్నాక:ఈ నెల 29వ తేదీన నిర్వహించనున్న "విజయ సంకల్ప యాత్ర" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం సభ్యులు పిలుపునిచ్చారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల కమిటీ సభ్యుడు మోతే శోభన్ రెడ్డిని తార్నాకలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి కార్యక్రమానికి అధికారిక ఆహ్వానం అందజేశారు.
ఈ సందర్భంగా ఉద్యమకారుల ప్రతినిధులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమకారుల పాత్ర చారిత్రాత్మకమైందని, వారి సేవలను గుర్తిస్తూ నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్రకు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు, ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మోతే శోభన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని భావితరాలకు చాటిచెప్పే విధంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఉద్యమకారుల సంక్షేమం, తెలంగాణ అభివృద్ధి లక్ష్యాల సాధనకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేసేందుకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం నాయకులు, సభ్యులు మరియు పలువురు ఉద్యమకారులు పాల్గొన్నారు.




