Hyderabad: ఐ.ఎస్. సదన్ సంగం లక్ష్మీబాయి కాలేజ్ వద్ద ఉద్రిక్తత!
Hyderabad:హైదరాబాద్ ఐఎస్ సదన్ లక్ష్మీబాయి కాలేజ్ వద్ద పుస్తకాల పంపిణీ వివాదంలో 'మన ఆలోచన సాధన సమితి' ధర్నా చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు.
Hyderabad: ఐ.ఎస్. సదన్ సంగం లక్ష్మీబాయి కాలేజ్ వద్ద ఉద్రిక్తత!
హైదరాబాద్:- ఐ.ఎస్. సదన్లోని సంగం లక్ష్మీబాయి కాలేజ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సంగం లక్ష్మీబాయి జయంతి సందర్భంగా పుస్తకాల పంపిణీ అంశం వివాదానికి దారితీయడంతో ఆందోళన చెలరేగింది.
ఐ.ఎస్. సదన్లోని సంగం లక్ష్మీబాయి కాలేజ్లో సంగం లక్ష్మీబాయి జయంతి సందర్భంగా పుస్తకాల పంపిణీ విషయంలో వివాదం నెలకొంది.
ఈ క్రమంలో మన ఆలోచన సాధన సమితి ఆధ్వర్యంలో కళాశాల ఎదుట ధర్నా చేపట్టారు.
పుస్తకాల పంపిణీని అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ సమితి సభ్యులు నిరసన వ్యక్తం చేశారు.
దీంతో కాలేజి పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని ఇరు వర్గాలతో చర్చలు జరుపుతూ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరిగింది.
కాలేజి వద్ద ఎటువంటి అవాంఛనియా సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భద్రత చర్యలు చేపట్టడం జరిగింది.
ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.




