Kutbullapur: కొంపల్లి కిమ్స్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత, భారీ బిల్లులపై కుటుంబ సభ్యుల ఆందోళన!

Kutbullapur: కుత్బుల్లాపూర్ కొంపల్లి కిమ్స్ ఆసుపత్రిలో యువకుడి మృతితో ఉద్రిక్తత. కేవలం ఆరు గంటల్లోనే ఆరు లక్షల రూపాయల బిల్లు వేశారంటూ కుటుంబ సభ్యులు, స్నేహితుల ఆందోళన.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 3 Oct 2026 10:45 AM IST
Kutbullapur
X

Kutbullapur: కొంపల్లి కిమ్స్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత, భారీ బిల్లులపై కుటుంబ సభ్యుల ఆందోళన!

Kutbullapur: కుత్బుల్లాపూర్ కిమ్స్ హాస్పిటల్ లో దారుణం.నిన్న సాయంత్రం 4గంటలకు జీడిమెట్ల గ్రామానికి చెందిన పంచర్ షాప్ నిర్వహకుడి కూమరుడు నూర్ ఆలం (28) జాయిండీజ్ సమస్య తో అడ్మిట్ అయ్యాడు.అంత లోనే పరిస్థితి విషమించిందని హడావిడి చేసిన వైద్యులు చివరికి నూర్ ఆలం చికిత్స పొందుతు మృతి చేందడని ప్రకటించారు.

వెంటనే 6లక్షలు బిల్లు కట్టాలని సూచించారు.అడ్మిట్ చేసిన 6గంటల్లో 6లక్షలు బిల్లు ఎలా వేస్తారు చివరకు శవం అప్పగించారాని ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబసభ్యులు,యువకుడి స్నేహితులు పెద్ద ఎత్తున కొంపల్లి కిమ్స్ హాస్పిటల్ వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు.అధిక బిల్లు లు వేసి వైద్యాని వ్యాపారం చేస్తున్న హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR