Kuntloor: కుంట్లూరులో కూల్చివేతలపై ఉద్రిక్తత

Kuntloor: హైదరాబాద్ కుంట్లూరులో రోడ్డు ఆక్రమణలపై కూల్చివేతలకు వచ్చిన అధికారులను కాలనీ వాసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.

AJAY, HAYATH NAGAR
Published on: 29 April 2026 12:11 PM IST
Kuntloor
X

Kuntloor

Kuntloor: నగర శివారులోని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధి కుంట్లూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రోడ్డు ఆక్రమణలపై చర్యలకు వచ్చిన హైడ్రా అధికారులు, స్థానిక గేటెడ్ కమ్యూనిటీ నివాసితుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.

కుంట్లూరులోని ప్రజయ్ గుల్మొహర్ గేటెడ్ కమ్యూనిటీలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్డును కబ్జా చేశారనే ఫిర్యాదులపై అధికారులు పరిశీలన జరిపి ఆక్రమణలను తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో హైడ్రా సిబ్బంది యంత్రాలతో అక్కడికి చేరుకున్నారు.

అయితే అధికారుల రాకను గమనించిన కాలనీ వాసులు ఏకమై ప్రధాన గేటు వద్ద వారిని అడ్డుకున్నారు. కూల్చివేతలను అనుమతించబోమని స్పష్టం చేస్తూ గేటు వద్దే నిరసనకు దిగారు.

దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు జోక్యం చేసుకున్నారు. అనంతరం కూల్చివేతలు కొనసాగినట్లు సమాచారం.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR

Next Story